కన్యాకుమారి నుంచి ఖర్‌దుంగ్లా వరకు 4,011 కి.మీ. దూరం అతి తక్కువ సమయంలో ప్రయాణించిన ఇవి
రాష్ట్రంలోని తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసిన గ్రాప్టన్ మోటార్స్ కంపెనీ
బైక్ రూపొందించిన బృందంలో సిరిసిల్ల కుర్రాళ్లు ఉన్నందుకు గర్వపడుతున్నామంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోనే తొలి ఎలకిక్ట్రిక్ బెక్‌ను విడుదల చేసిన గ్రావ్టన్ మోటార్స్ కంపెనీ అరుదైన ఘనత సాధించింది. ఈ బెక్ చార్జింగ్ కోసం ఎక్కడా ఆగకుండా కన్యాకుమారి నుంచి ఖర్‌దుంగ్ లా (కె 2కె రైత్) వరకు ఏకంగా 4011 కిలోమీటర్ల దూరం అతి తక్కువ సమయంలో ప్రయాణించి ఈ ఘనతను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కంపనీ బృందానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ కె. తారకరామారావు అభినందనలు తెలుపారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఈ ఘతన సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కంపనీ బృందానికి అభినందనలు తెలుపుతూ శుక్రవారం మంత్రి కెటిఆర్ ఒక ట్వీట్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ రూపొందించిన కోర్‌టీమ్‌లో తమ సిరిసిల్ల కుర్రాళ్లు ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నానని కెటిఆర్ పేర్కొన్నారు.
ఈ రంగంలోనే మొదటిసారిగా గ్రావ్టన్ సంస్థ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కడం ఆనందంగా ఉందన్నారు.. గ్రాప్టన్ క్వాంటా అనేది పనితీరుతో దూసుకెళ్లే వాహనంగా నిరూపించినట్లు అయిందన్నారు. క్వాంటా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ బైక్ కేవలం రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ ఇటీవల వెల్లడించిందన్నారు. ప్రమోషనల్ ఆఫర్‌గా ధరను రూ.99,000గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపిందని పేర్కొన్నారు. కాగా ఈ బెక్ ప్రత్యేకలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. కేవలం రూ.80లకే 800 కిలోమీటర్ల ప్రయాణం, బిఎల్‌డిసి మోటర్‌తో గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణంచే అవకాశముందన్నారు. ఒక్కసారి ఛార్జీ చేస్తే 150 కిలోమీటర్ల ప్రయాణం, 320 కిలోమీటర్ల వరకూ పెరిగే అవకాశముందన్నారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్‌లో 90 నిముషాల్లో బ్యాటరీ ఛార్జింగ్, బ్యాటరీకి 5 ఏండ్ల వారెంటీ ఇవ్వడం కూడా చాలా అరుదన్నారు.