Monday, December 23, 2024

ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన గుత్తా, ఎమ్మెల్యే, ఎస్పీ
నల్గొండ : బక్రీద్ పర్వదినాన్ని జిల్లా కేంద్రంలో ముస్లీం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లీం మత పెద్ద ఎహాసానుద్దీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఈద్గా వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎస్పీ అపూర్వరావుతో పాటు గుత్తా అమిత్ రెడ్డి, పలువురు ఈద్గా వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి మైనారిటీ నాయకులు బషీర్‌తో పాటు పలువురికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News