Wednesday, November 6, 2024

విద్యాభివృద్ధికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన ప్రభుత్వ విద్యనందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందుకోసం అన్ని పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలకు పక్కా భవనాలతో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తోడ్పాడుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం మంత్రి జిల్లా పరిధిలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు గావించారు. కేసముద్రం మండల కేంద్రంలో రూ. ఐదు కోట్ల ఆంచనా వ్యయంతో నిర్మించనున్న టిటిడబ్లూయూఆర్‌జేసి బాలికల నూతన తరగతి గదుల భవ న సముదాయ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం లో ఆర్‌అండ్‌బి రోడ్డు నుంచి చెరువు ముందు తండా మీదుగా వయా మర్రితండా, గోప్యా తండాల మీదు గా నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన గావించారు. మహబూబాబాద్ పట్టణంలోని 13 వ వార్డు పరిధిలో రూ. 2.70 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బాలికల వసతి భవన నిర్మాణ పనులకు మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. మానుకోటలో రూ. ఐదు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న టిటిడబ్లూయూఆర్‌జెసి బాలుర నూతన తరగతి గదుల భవన సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏ పాలకులు కూడా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే రీతిలో పాఠశాలలు, గురుకలాల అభివృద్దిని పట్టించుకోలేదన్నారు.

వేలా కోట్ల రూపాయలు వెచ్చించి గురుకుల పాఠశాలలు, కళాశాలలు, మానుకోట ప్రాంతంలో గురుకుల ఇం జనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గిరిజనులు అత్యధులుగా ఉన్న మానుకోట ప్రాంతంలో గిరిజనుల పిల్లల కోసం అత్యాధునికంగా గురుకులాలు ఏర్పా టు చేస్తు వారి పిల్లలకు ప్రభుత్వ విద్యను అందించేందుకు పెద్దెత్తున అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో గిరిజన గురుకులాల పిల్లలు అత్యధ్భుతంగా విజయాలు సొంతం చేసకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోగలిగారన్నారు. మానుకోటలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు కూడా ప్రారంభించుకోవడం ఈ ప్రాంతంలో ఉన్నత విద్యాప్రమాణాలు పెంపొందించే కార్యక్రమంలో ఒకటిగా అభివర్ణించారు. ఇంకా కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మైన్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News