Monday, December 23, 2024

పిసిబిలో ఘనంగా గణేష్ శోభయాత్ర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్సవాలు ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపుతాయని పిసిబి సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. శనివారం సనత్‌నగర్‌లోని పిసిబి కార్యాలయంలో మట్టి గణపతికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో జరిగిన శోభయాత్రలో ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. పిసిబి ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి.రఘు, జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ సత్యనారాయణరావు, డాక్టర్ ప్రసనకుమార్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మధుగౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, వివేకానందమూర్తి, స్వామి దయానంద్, వెంకట్‌రావు, సునీల్ సింగ్, రమేష్, ఉబేద్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News