Friday, December 27, 2024

హనుమంతరావుకు ఘన సత్కారం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : మానుకోటకు బుధవారం విచ్చేసిన మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడికి రాగా ఆయన భరత్‌చందర్‌రెడ్డి నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలు కలసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో తిరిగి కాంగ్రెస్‌ను గెలిచిపించుకునేందుకు పార్టీ నాయకులంతా ఐకమత్యంతో పనిచేయాలని హనుమంతరావు సూచించారు. హనుమంతరావును కలసిన వారిలో పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి తేజావత్ బెల్లయ్యనాయక్, నాయకులు డాక్టర్ భూక్య మురళీనాయక్, ఘనపురపు అంజయ్య,జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, మిట్టకంటి రాంరెడ్డి, ఖలీల్, శ్రీనివాస్, రాంచందర్, నరేష్, రాంశెట్టి వీరేందర్, రామరాజు ఉపేందర్, గుగులోతు వెంకట్‌నాయక్, బోడ రవినాయక్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News