Thursday, January 23, 2025

అజిత్‌తో పనిచేయడం గొప్ప అదృష్టం

- Advertisement -
- Advertisement -

Great luck working with Ajith

 

కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా కార్తికేయ విలన్‌గా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వలిమై’. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ “2019లో నాకు దర్శకుడు హెచ్ వినోద్ నుంచి కాల్ వచ్చింది. అజిత్‌తో చేసే సినిమాలో విలన్‌గా చేయమని అడిగారు. నా పాత్ర గురించి విన్న తర్వాత వెంటనే అజిత్ పక్కన విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నాను. అజిత్‌తో పనిచేయడం గొప్ప అదృష్టం. ఓ సీన్‌లో బైక్‌పై నుంచి పడిన తర్వాత కూడా ఆయన షూట్‌కు సిద్దమయ్యారు. ఆయన నుంచి పక్కా ప్రొఫెషనలిజాన్ని నేర్చుకున్నాను. ఇక హీరో, విలన్ అనేది నేను పెద్దగా పెట్టించుకోను. కెమెరా ముందుకు వచ్చానంటే క్యారెక్టర్ పరంగా నటించాల్సిందే. విలన్ అంటే నటనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. హీరో అయితే కొన్ని పరిమితులు ఉంటాయి. నా కెరీర్‌లో ‘వలిమై’ చిత్రం అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ చిత్రానికి బోని కపూర్ నిర్మాత కావడం నాకు హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా ద్వారా కన్నడ, తమిళం, మలయాళం, ఇతర భాషల్లో నాకు మంచి గుర్తింపు వస్తుంది” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News