Monday, December 23, 2024

2కె రన్‌కు విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన 2కె రన్‌కు విశేష స్పందన వచ్చింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యాలయాలు, కళాశాలలు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు రన్‌కు తరలివచ్చారు. సోమవారం ఉదయం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిర్వహించిన తెలంగాణ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

జెవిఆర్ డిగ్రీ కళాశాల నుండి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ వరకు తెలంగాణ 2కె రన్‌ను నిర్వహించారు. తెలంగాణ ప్రగతిని నలువైపులా చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో కార్యక్రమాలను చేపడుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఎసిపి బి.రామానుజం, కమాండెంట్ జలీల్ ఖాన్జి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు,

మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆర్‌డిఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎంపిడిఓ సుభాషిణి, ఫారెస్ట్ సిబ్బంది, సిఐలు కరుణాకర్, హనూక్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, మండల పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, కనగాల వెంకటరావు, ఎంపిపిలు దొడ్డా హైమావతి, పగుట్ల వెంకటేశ్వరరావు, జట్పిటిసిలు కూసంపూడి రామారావు, చెక్కిలాల మోహన్‌రావు, మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్, చాంద్‌పాషా, పాల కృష్ణారావు, అధికార సిబ్బంది, నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News