Wednesday, January 22, 2025

కెటిఆర్ రోడ్ షోలకు విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

క్షణం తీరిక లేకుండా లేకుండా
బిజి బిజీగా కెటిఆర్ ఎన్నికల ప్రచారం
ఆలోచింపజేస్తున్న కెటిఆర్ ప్రసంగాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మూడోసారి గెలిపించడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కెటిఆర్ పాల్గొంటున్న రోడ్ షోలకు విశేష స్పందన లభిస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు నుంచే అనేక నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ పార్టీ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అందులో పాల్గొన్న మంత్రి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత క్షణం తీరిక లేకుండా సభలు, సమావేశాశాల్లో పాల్గొంటూనే రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కెసిఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యంగా కెటిఆర్ ముందుకు సాగుతున్నారు. ఈ నెల 15 నుంచి కెటిఆర్ బిజి బిజీగా వినూత్న పద్దతుల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, మహిళలు, ఉద్యోగార్థులతో వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూనే పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం చౌటుప్పల్, కోదడ, ముల్కనూరు, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్‌లో కెటిఆర్ రోడ్డు షోలలో కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు.

సూటిగా…సుత్తిలేకుండా కెటిఆర్ ప్రసంగాలు
బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా కెటిఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలలో సూటిగా సుత్తి లేకుండా ప్రసంగిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, మరోసారి తమకు అవకాశం ఇస్తే చేయబోయే పనులను వివరిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో వచ్చిన విప్లవాత్మక పురోగతితో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు ఏర్పాటు వివరిస్తూ , గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్నారు.

ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం బెంగళూరుకు ధీటుగా ఎదిగి భారీ స్థాయిలో ఉద్యోగాలు లభిస్తున్న వాస్తవాలను గణాంకాలతో సహా కెటిఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు యువత నుంచి మంచి స్పందన
లభిస్తోంది. అలాగే ప్రభుత్వ రంగంలో గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, 1.60 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేసిన వాస్తవాలను గణాంకాలతో సహా నిరుద్యోగ యువత ముందు ఉంచడంతో పాటు మరోసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, పరీక్షల నిర్వహణలో అవసరమైన మార్పులు తీసుకువచ్చి, వేగవంతంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని ఉద్యోగార్థుల్లో కెటిఆర్ భరోసా నింపుతుండటంతో నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రుల నుంచి కెటిఆర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News