జవహర్‌నగర్: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జవహర్‌నగర్ నగర పాలక సంస్థ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను గుర్తించి వారికి అవార్డు అందిస్తు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకోని జవహర్‌నగర్ నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు.
మంత్రి మల్లారెడ్డి సహకారంతో కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం శానిటేషన్ వాహనాలను అందంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, మేనేజర్ ప్రభాకర్, కార్పొరేటర్లు వేణుముదిరాజు, ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్, లలితాయాదవ్, రవి, రాజ్‌కుమార్, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ నూరుద్ధీన్ పారుఖ్, శోభారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఇంఛార్జి చామకూర మహేందర్‌రెడ్డి, జవహర్‌నగర్ కార్పొరేషన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజు, జిల్లా సీనియర్ నాయకులు ఆలూరి రాజశేఖర్, పూడురు చందర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.