త్వరలోనే వాటిని వెల్లడిస్తాం
ప్రతిపక్షాల మాటలు నమ్మితే అథోగతే
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్ : పనితనంలో ఏం చేతకాదు. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలే రు. కేవలం అధికారంలోకి రావటానికే ప్రతిపక్ష నాయకు లు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు చెప్పే పథకాల కంటే ఇంకా బ్రహ్మాండమైనా పథకాలు సిఎం కెసిఆర్ అమలు చేస్తారని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఎన్నికల సమయంలో బెంగళూరు నుంచి వచ్చే నాయకుల మాటలు నమ్మితే అధోగతి పాలు కావటం ఖాయమని వారి మాటలకు మోసపోవదద్దని కెటిఆర్ ప్రజలకు సూచించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ రెండో విడత కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ హాజరయ్యారు.
మొద ట కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద శాస్త్రోక్తంగా, వేద మంత్రాల మధ్య పూజలు నిర్వహించిన కెటిఆర్, అధికారులు, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్ర భుత్వ విప్, రంగారెడ్డి జిల్లా ఎంఎల్‌సి శంభీపూర్ రాజు, న వీన్‌రావు, కుత్బుల్లాపూర్ ఎంఎల్‌ఎ కెపి వివేకానంద్, కూకట్‌పల్లి ఎంఎల్‌ఎ మాధవరం క్రిష్ణారావులతో కలిసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు కట్టి చూడు పెళ్ల్లి చేసి చూడు అన్నది పా త సామెత అని సిఎం కెసిఆర్ కృషితో ఆ రెండింటి కష్టాలు ప్రజలకు లేకుండా చేశారని కెటిఆర్ తెలియజేశారు. అనంతరం మంత్రి కెటిఆర్ సమక్షంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్‌లు లబ్ధిదారుల ఎంపిక పద్ధతిని సభావేదికపై ప్రజంటేషన్ రూపం లో చూపించారు. దీంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎటువంటి పైరవీలు లేకుం డా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు అందజేస్తున్నందుకు వారి పనితీరును అభినందించారు.
అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ఆడపడుచులకు ఇల్లు కట్టిచ్చి, పెళ్లికి కళ్యాణలక్ష్మినిచ్చి సిఎం కెసిఆర్ మేనమామ పాత్ర పోషించడం గర్వకారణం అన్నారు. నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఇచ్చిన మాట ప్రకారం లక్షలు విలువ చేసే డబుల్ బెడ్‌రూమ్‌ను ఇవ్వడం దేశంలో ఎక్కడా ఏప్రభుత్వం చేయలేదని అది తెలంగాణ రాష్ట్రానికే సాధ్యం అన్నారు. ఎన్నికల ముందు ఇతర పార్టీల వారు చెప్పే మాటలకు ప్రజలకు మొసపోవద్దని సూచించారు. రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేదకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో అందరికి ఒ కే న్యాయం అన్న విధంగా సేవలు అందిస్తున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. కుత్బుల్లాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ పారదర్శకంగా ఎవరికి ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా నిరుపేదలకు అందజేస్తున్నామని స్పష్టంచేశారు.కుత్బుల్లాపూర్‌నియోజకర్గం 126, జగద్గిరిగుట్ట డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ డివిజ న్ మహిళా అధ్యక్షురాలు, కౌసల్య, బిజెపి పా ర్టీ మహిళ సునితకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మొదటి విడతలో లక్కీడ్రా ద్వారా వచ్చిందని ఇది తమ పనితీరుకు నిదర్శనమన్నారు. అభివృద్ధిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూసుకుపోతుందని మంత్రి కెటిఆర్‌స్పష్టం చేశారు. పార్టీలో స్థానికంగా ఉన్న ఉన్న వర్గపోరుపై త నదైన శైలిలో మాట్లాడిన కెటిఆర్ ప్రజలకు వీరు ఎప్పుడూ అందుబాటలో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఎమ్మెల్సీ శంభీపూర్‌కు శా సనమండలి సభ్యుడిగా, ప్రభుత్వవిప్‌గా, కు త్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మరోసారి శాసనసభ్యుడిగా సిఎం కెసిఆర్ అవకాశం క ల్పించారన్నారు. అందరూ ప్రజలకు అందుబాటలో ఉండి మెరుగైన సేవలు అందించాలని కెటిఆర్ నేతలకు సూచించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యతిధిగా హాజరైన కెటిఆర్‌ను, సిఎం కెసిఆర్‌ను ఎమ్మెల్యే వివేకానంద్ పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు నీటి ఎద్దడి ఉండి ట్యాంకర్ల వద్ద అక్కాచెల్లెల్లు కొట్టుకునేవారు అన్నారు. ఇప్పుడు సిఎం కెసిఆర్ చొరవ, మంత్రి కెటిఆర్ ఆశీస్సులతో కుత్బుల్లాపూర్‌కు మిషన్ భగీరధ, నీళ్ల్ల ప్రాజెక్టులు ఇచ్చి సమస్య పరిష్కారం చేశారన్నారు. అదేవిధంగా కూకట్‌పల్లి, బాలానగర్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, బాచుపల్లి బ్రిడ్జి, సుచిత్ర బ్రిడ్జిలతో రోడ్లు అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాయి అన్నారు. రహదారులు నిర్మాణం జరుగుతున్నాయని కొనియాడారు.
భగవంతుడు తెలంగాణ రాష్ట్రానికి సిఎం కెసిఆర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బహుమతిగా ఇస్తే, మంత్రి కెటిఆర్‌ను సిఎం కెసిఆర్ భవిష్యత్ తరాల ప్రజలకు సేవ చేసేందుకు మనకు కెటిఆర్‌ను కెసిఆర్ బహుమతిగా ఇచ్చారని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ సందర్భంగా వివిధపార్టీల రాజకీయ నాయకులకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్‌రెడ్డి, జెపి నాయకులు కౌన్సిలర్లు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లా కల్లెక్టర్లు, అనుదీప్, అమోయ్‌కుర్, జీహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్‌లతో పార్టీ నాయకులు పాల్గొన్నారు.