Monday, December 23, 2024

ముషీరాబాద్‌లో ఘనంగా ఆధ్యాత్మిక సంబురాలు

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక సంబురాలు బుధవారం ఘనంగా జరిగాయి. వివేక్ నగర్ ఆంజనేయస్వామి దేవాలయం, లోయర్ ట్యాంక్ బండ్ శ్రీకనకాల కట్టమైసమ్మ దేవాలయం, గాంధీ నగర్ లతితా పరమేశ్వరీ దేవాలయం, ఆర్టీసీక్రాస్‌రోడ్ శ్రీలక్ష్మీగణపతి దేవాలయం తదితర దేవాలయాలలో ఆధ్యాత్మిక ఉత్సవాలు ఆయా దేవాల యాల నిర్వాకులు, ఆలయ అధికారులు, సి బ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలలో జరిగిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు.

వివేక్ నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీచండీ సప్తశతీ హోమము, అన్నదానం నిర్వహించారు. అనంతరం శ్రీవి ష్ణు సహస్రనామ సామూహిక పారాయణం చేశారు. కార్యక్రమంలో ఈవో ఎం. దేవనాథం, ప్రధాన అర్చకులు బుగ్గ లక్ష్మీపతి శర్మ, ఆచార్యులు, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, బిఆర్‌ఎస్ నాయకులు ముఠా జైసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్ రా వు, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, రాకేష్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News