Monday, December 23, 2024

రియల్ రంగంలో దూసుకుపోతున్న గ్రేటర్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

Greater Hyderabad booming in real estate sector

ఈ ఏడాది రికార్డు స్థాయిలో 73 శాతం
పెరిగిన ఆదాయం

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ రియల్ రంగంలతో దూసుకుపోతోంది. గత రెండేళ్లతో పొల్చితే గత ఆర్థిక సంవత్సరం (2021.-22)లో నగరంలో భారీగా నిర్మాణాలు వెలిశాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిపాస్‌తో పాటు నిర్మాణరంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భూ వివాదాలకు అవకాశమే లేకుండా హెచ్‌ఎండిఎ ఆధ్యర్యంలో వెంచర్లను ఏ ర్పాటు చేస్తుండడం కూడా రియల్ రంగానికి ఊతమిస్తోంది. మరోవైపు నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు జిహెచ్‌ఎంసి పెద్దపీట వేయడం, రోడ్ల నిర్మాణం, వాటి నిర్వహణను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు దీటుగా నిర్వహిస్తుండడమే కాకుండా మురుగు నీరు, వరద ముంపు సమస్యలు లేకుండా ప్రభుత్వం భారీగా అభివృద్ధి పనులు చేపడుతుండడంతో నిర్మాణం రంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది. గడిచిన గత రెండు ఆర్థిక సంవత్సరాలకాలంలో నిర్మాణ రం గంపై కరోనా కొంత ప్రభావం చూపుగా గత ఆర్థిక సంవత్సరంలో భారీగా పుంజుకుంది. నగరంలో హైరైజ్ భవనాలతో పాటు వ్యకిగతగృహ నిర్మాణాలు అపార్ట్‌మెంట్లు పెద్ద సం ఖ్య లో నిర్మాణాలు నగరంలో కొనసాగుతున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణాల అనుమతులకు సంబంధించి బల్దియాకు పెద్దఎత్తున దరఖాస్తులు రావడం, జి హెచ్‌ఎంసి అధికారులు సైతం రికార్డుస్థాయిలో అనుమతులను జారీ చేశారు. ఇందులో భాగంగా వాణిజ్య భవనాల సం బంధించి 198 అనుమతులు జారీ చేయగా ఇందులో 15 హై రైజ్ భననాలు ఉన్నాయి. అదేవిధంగా ఇనిస్టిట్యూట్‌లు, ఆసుపత్రి త దితర భవనాలకు 40 అనుమతులు జారీ చేయగా ఇందులో 7 హైరైజ్ నిర్మాణాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి 17,334 అనుమతులను ఇవ్వగా ఇందులో 61 హైరైజ్ భవనా నిర్మాణాలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఆకాశ హర్మాణ్యాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ఏడాది 41అంతస్తుల భవన నిర్మాణాలకు సం బంధించి జి హెచ్‌ఎంసి 3 అనుమతులను మంజూరు చేసింది. ఇందులో రెండు మల్లీప్లెక్స్ భవనాలు ఉన్నాయి. అదేవిధంగా 30 అంతస్తులకు మించిన మరో 13 ప్రాజెక్టులకు జిహెచ్‌ఎంసి అనుమతులను మంజూరు చేసింది. ఇందులో 5 కమర్షియల్ ప్రాజెక్టులుండగా 8గృహ నిర్మాణాలకు సంబంధించిన ఉన్నాయి.

బల్దియాకు భారీ ఆదాయం
నగరంలో నిర్మాణం రంగం ఒక్కసారిగా పుంజుకోవడంతో బల్దియాకు భారీగా ఆదాయం వచ్చిపడుతోంది. అన్ని రకాల భవన నిర్మాణాలు సంబంధించి గత ఆర్ధిక సంవత్సరంలో బల్దియాకు భారీ దరఖాస్తులు రావడంతో అంతే వే గంగా అధికారులు అనుమతులు మంజూరు చేయడంతో జిహెచ్‌ఎంసి ఫీజుల రూపంలో రూ.1148 కోట్లు ఆదాయం వచ్చింది. గత ఆర్ధిక సంవత్సరంలో కేవలం రూ.661కోట్లు మాత్రమే రాగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 73 శాతం అధిక ఆదాయం వచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో రియల్ రంగం మరింత వేగంగా పుంజుకునే అవకాశాలున్నాయి. కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పాటు విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతున్న గ్రేటర్ హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా నివాస యోగ నగరంలో పేరు ఉండడంతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పచుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తి చూపుతుండడమే కాకుండా అనేక అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఈ ఏడాది మరింత శరవేగంగా రియల్ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోనుందన్న అధికారులతో పాటు రియల్ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News