=ఎస్‌ఆర్‌డిపితో దశ మారిన నగర రోడ్లు
=చివరికి చేరుకుకున్న మొదటి దశ పనులు
=రెండో దశ పనులకు కసరత్తు
హైదరాబాద్: గ్రేటర్‌లో జిహెచ్‌ఎంసి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డిపి)తో హైదరాబాద్ రోడ్ల దశపూర్తిగా మారిపోయింది. హైదరాబాద్‌లోని రోడ్లు, జంక్షన్లను ట్రాఫిక్ రహితం చేయడమే లక్ష్యంగా రూ.29వేల 695 కోట్లతో ఎస్‌ఆర్ డిపి భారీ ప్రాజెక్టుకు జిహెచ్‌ఎంసి రూపకల్పన చేసినవి షయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలో మొత్తం 9000 కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఇందులో ప్రధాన ర హదారులు 1500కిలో మీటర్లు ఉన్నాయి. నగరంలో దాదాపు 60లక్షల వాహనాలు ఉండగా ప్రతిరోజు దా దాపు 1000 కొత్త వాహనాలు సిటీలో రిజిస్టర్ అవుతున్నాయి. దేశంలోనే అత్యంత వాహనాల డెన్సిటి ఎక్కవగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉం ది. ఇదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 221 జంక్షన్లు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండి ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్‌జాం అయ్యే జంక్షన్లు 111 ఉన్నా యి. వీటిలో కొద్ది సమయం సిగ్నల్ పడితే చాలు అక్కడ ట్రాఫిక్ జాం అవుతుంది.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా సమస్యను పరిష్కరించేందుకు గాను ప్రధాన ప్రాంతాల్లోని 54 జంక్షన్లలో ఎలివేటే డ్ కారిడార్లు, గ్రేడ్ సపరేటర్ల, స్కైవేల నిర్మాణానికి జి హెచ్‌ఎంసి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టులు పూర్తి అయితే నగరంలో 85 నుండి 95శాతం ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఇందులో భాగంగా నగరంలోని ఇందులో జంక్షన్ అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా అందుబాటులో కి వస్తున్నాయి. ఇందులో భాగంగా మొదటి దశ కింద రూ. 8,092 కోట్ల పనులు ప్రారంభం కాగా. ఇందులో ఇప్పటి వరకు 47 ప్రాజెక్టులకు రూ. 5,557 కోట్లను ఖ ర్చు చేశారు. మిగిలిన పనులు సైతం వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఈ 47 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు పూ ర్తి అయిన ప్రాజక్టులు 26 ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఫ్లై ఓవర్లు అండర్ పాస్‌లు నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అయ్యాయి.
అందుబాటులోకి వచ్చిన
2
6 ప్రాజెక్టులు
1. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ 2. మైండ్ స్పెస్క జంక్షన్ అండ్ పాస్ 3. మైండ్ స్పెస్ జంక్షన్ ఫ్లై ఓవర్ 4. చింతల్‌కుంట చెక్ పోస్ట్ జం క్షన్ అండ్ పాస్ 5. కామినేని జంక్షన్ లెప్ట్ సైడ్ ప్లై ఓవర్ 6. ఎల్బీనగర్ లెప్ట్‌సైడ్ ఫ్లైఓవర్ 7. రాజీవ్‌గాంధీ స్టా చ్యూ ఫ్లైై ఓవర్ 8. బయోడైవర్సిటీ లెవల్ వన్ ఫ్లైై ఓవర్ 9. బయోడైవర్సిటీ లెవల్ టూ ఫ్లైై ఓవర్ 10. ఎల్బీనగర్ లెప్ట్ సైడ్ అండ్‌పాస్ 11. కామినేని జంక్షన్ రైట్ సైడ్ ఫ్లై ఓవర్ 12. బైరామాల్ గుడా రైట్ సైడ్ ఫ్ల్లైై ఓవర్ 13. పంజాగుట్ట్ట స్టీల్‌బ్రిడ్జి 14. ఉప్పుగూడ రైల్వేఅండర్ బ్రిడ్జి. 15. ఎలివేటెడ్ కారిడార్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు 16 దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి 17. లాలపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి 18. ఉత్తమ్ నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి 19. హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి 20. ఒఆర్‌ఆర్ నుంచి మెదక్ మార్గంలో నేషన్ హైవే వరకు రోడ్డు పునరుద్ధ్దరణ 21. ఆనంద్‌బాగ్ రైల్వే అండ్ బ్రిడ్జి. 22. బాలానగర్ జంక్షన్ ఫ్లైై ఒవర్ 23. చాంద్రాయన్ గుట్ట్ట అబ్దుల్ కలామ్ జంక్షన్ ఫ్లైై ఓవర్. 24. షేక్‌పేట్ ఫ్లై ఓవర్, 25, తుకారం గేట్ ఆర్‌యుబిని మంత్రి కెటిఆర్ ఇటీవలే ప్రారంభించారు. ఎల్‌బినగర్ వద్ద మరో అం డర్‌పాస్ మార్గం పూరై ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
చివరిదశలో మరో 21 పనులు
ఇంకా 21ప్రాంతాల్లో చేపట్టిన పనుల పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో ప్రధానమైనవి ఎల్బీనగర్ రైట్ సైడ్ ఫ్లై ఓవర్, అండర్‌పాస్. బైరామల్‌గూడ లెప్ట్ సైడ్ ఫ్ల్లైై ఓవర్, నాగోల్ ఆరు లెన్ల ఫ్లైై ఓవర్, ఓర్, ఆరామ్ ఘర్ నుంచి జూపార్క్ వరకు ఫ్ల్లైై ఒవర్, బహుదూర్‌పురా ఫ్లైఓవర్, బోటనికల్ గాడ్డెన్, కొండాపూర్ జంక్షన్ ఫ్లైై ఓవర్లు, ఇందిరాపార్క్ నుండి విఎస్టీ జంక్షన్ భారీ ఫ్లై ఓవర్, అంబర్ పేట్ ఫ్లైై ఓవర్, పలు ప్రాంతాల్లోని ఆర్‌ఓబిలు, ఆర్‌యు బిలు నిర్మాణ పనులు చాలా మేరకు చివరి దశలో ఉన్నాయి.
రెండో దశ పనులు షురూ
ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా నగరంలో రెండవ దశ పనులకు ప్రారంభం అవుతున్నాయి. మొదటి దశ కింద చేపట్టిన47 ప్రాజెక్టులో ఇప్పటికే 25 ప్రజలకు అందుబాటులోకి రాగా మిగిలిన ప్రాజెక్టులో చాలా మేరకు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో రెండవ దశ పనులకు అధికారులు కసరత్తును పూర్తి చేశారు. ఇం దులో భాగంగా రూ. 3115 కోట్ల వ్యయంతో 12 ప్రాజక్టులను అధికారులు చేపట్టనున్నారు. వీటికి తోడు నగరంలోని ఆయా నియోజకవర్గాల్లోని రోడ్ల అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేలు, కార్పోరేటర్ల నుంచి సైతం స్వీకరించిన ప్రతిపాదనలన మేరకు అవసరమైన చోట్ల పనులను చేపట్టేందుకు సైతం కసరత్తు చేస్తున్నారు.