Thursday, January 23, 2025

పక్కింటి వ్యక్తి బాలికను చంపి… సూట్‌కేసులో దాచి

- Advertisement -
- Advertisement -

లక్నో: రెండేళ్ల బాలిక అదృశ్యం కావడంతో పక్కింట్లో ఉండే వ్యక్తి ఆ చిన్నారిని చంపి తన సూట్‌కేసులో మృతదేహాన్ని దాచిపెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దేవ్లా ప్రాంతంలో శివ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఓ కంపెనీలో శివ కుమార్ జాబ్ చేస్తున్నాడు. గత శుక్రవారం శివ కుమార్ ఆఫీస్‌కు వెళ్లగా భార్య కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లింది. ఇంటికి వచ్చేసరికి బాలిక కనిపించకపోవడంతో పరిసరాలు మొత్తం వెతికింది. భర్తతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఎక్కడ వెతికినా బాలిక ఆచూకీ కనిపించలేదు.

ఆదివారం పక్కింటి నుంచి దుర్గంద వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇంటి డోర్ లాక్ చేసి ఉండడంతో పక్కింటి వ్యక్తి రాఘవేంద్రకు ఫోన్ చేయగా స్విచ్ఛ్ ఆఫ్ రావడంతో బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేశారు. సూట్ కేసులో బాలిక శవం కనిపించడంతో తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. తన కూతురు లేదనే బాధ గుండెలు విలిసేలా రోదించారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక అదృశ్యమైనప్పుడు చిన్నారి తల్లితో కలిసి రాఘవేంద్ర కూడా వెతికాడు. పోలీసులు కేసు నమోదు చేసి రాఘవేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రాల నేపథ్యంలో బాలికను బలి ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News