Friday, January 10, 2025

యూనివర్సిటీలో విద్యార్థినిపై విద్యార్థి కాల్పులు… ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: విద్యార్థినిపై విద్యార్థి కాల్పులు జరిపిన తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని శివ నాదర్ యూనివర్సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యుపి రాష్ట్రం అమ్రో జిల్లాకు చెందిన అనూజ్, కాన్పూర్‌కు చెందిన నేహా చౌరాసియా శివ నాయదర్ యూనివర్సిటీలోని సోషియాలజీలో బిఎ చదువుతున్నారు. నేహా, అనూజ్ మంచి స్నేహతులుగా ఉండేవారు.

Also Read: ఒక పక్క ఎండలు.. మరో వైపు జల్లులు

డైనింగ్ హాల్ అనూజ్, నేహా మధ్య చిన్న ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే అనూజ్ తుపాకీ తీసి ఆమెను కాల్చాడు. అనంతరం తన రూమ్‌కి వెళ్లి తనకు తాను గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డిసిపి సాద్ మియా ఖాన్ అక్కడికి చేరకొని ఇద్దరు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరు చనిపోయారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News