Sunday, December 22, 2024

గ్రేటర్ ప్రజలు నా మాట పాటించారు !

- Advertisement -
- Advertisement -
ఓటేసేందుకు ముందుకు రాలేదు: కెఏ. పాల్

మన తెలంగాణ/హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఈ ఎన్నికల్లో తన మాట విన్నారని, 40 శాతం మాత్రమే ఓటేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పేర్కొన్నారు. సీఈఓ వికాస్ రాజ్ ఒక పెద్ద డ్రామా నడుపుతున్నారని, అవినీతి చక్రవర్తిగా మారుతున్నారని ఆరోపించారు. ఆయనపై చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత నెల 30వ తేదీ రాత్రి తుంగతుర్తిలో ఈవిఎంలు కనబడటం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలోని 30 స్థానాల్లో ఈవిఎంలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని సర్వేలు చెపుతున్నాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు బిఆర్‌ఎస్ నాయకులకు టచ్‌లో ఉన్నారని, కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ రాకుంటే గులాబీ జెండా పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్వోలు అవినీతి చేస్తున్నారని, తను వికాస్ రాజ్‌కు అనేక ఫిర్యాదులు చేసినా ఒక్కటి కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర డబ్బులు ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News