Wednesday, January 22, 2025

గ్రేటర్‌లో ఘనంగా ఊరురా చెరువుల పండుగ

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: గ్రేటర్‌లో అన్ని చెరువుల పరిరక్షణతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఊరురా చెరువుల పండుగ ఉత్సవాల్లో భాగంగా గురువారం జూబ్లీహిల్స్‌లోని లోటస్‌పాండ్ చెరువు వద్ద అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు వద్ద మేయర్ విజయలక్ష్మితోపాటు పలువురు కార్పొరేటర్లు, మహిళలు బతుకమ్మలతో తరలివచ్చి ఆడి పాడారు. అనంతరం బతుకమ్మలను గంగమ్మ తల్లికి సమర్పించి మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఊరురా చెరువు ఉత్సవాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మేల్యే దానంనాగేందర్‌తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరురాచెరువుల పండుగ బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మిమాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో ఉన్న 185 చెరువుల పరిరక్షణకు జిహెచ్‌ఎంసి, హెచ్.ఎం.డి.ఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు కలిసిప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగను నియోజకవర్గ స్థాయిలో పెద్దఎత్తున పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ప్రజల భాగస్వామ్యంతో జరుపుకుంటున్నమన్నారు తెలంగాణ ఏర్పడక ముందు నగరం లో చెరువులు ఆక్రమణలతో, దుర్గంద భరితంగాఉండేవని, 2014 జూన్ 2 తర్వాత చెరువులను గుర్తించి చెరువుల పూడికతీత, పునరుద్ధరణ, సుందరీకరణకు రూ.345.81 కోట్ల అంచనా వ్యయంతో 355 పనులు చేపట్టినట్లు చెప్పారు. అందులో ఇప్పటి వరకు 191 పనులు పూర్తి కాగా మరో 144 పనులు ప్రగతి దశ లో ఉన్నాయని మేయర్ వెల్లడించారు. . నగరం లో చెరువుల ను అన్యాక్రాంతం కాకుండా కూడా చర్య తీసుకుంటున్నమన్నారు.

మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సూచనల మేరకు నిర్మాణ సంస్థలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీకింద నగరంలో ఇప్పటి వరకు 36 చెరువులను దత్తత తీసుకొని ఒక్కో చెరువుకు కోటి నుండి రూ. 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఖైరతాబాద్ జోన్‌షేక్ పేట్ షికారికుంట, కొత్త కుంట, బాతూర్ కుంట, వట్టి కుంట చెరువులపునరుద్దరణ కు చర్యలు తీసుకున్నామన్నారు. చెరువుల పటిష్టత స్లూస్ మత్తడి మరమ్మత్తులు మురుగు నీటి మళ్లింపు పనులు చేపట్టడంత లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు మేయర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ చెరువులపునరుద్ధ్దరణ ద్వారా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్లు రజనీకాంత్, మోహన్ రెడ్డి, జిహెచ్‌ఎంసి లేక్స్ సి. ఇ సురేష్, కార్పొరేటర్లు మన్నె కవిత, సంగీత యాదవ్, వెంకటేష్, ఆర్.డి.ఓ వసంత, ఇరిగేషన్ సి.ఇ ధర్మ, ఎస్.ఇ ఆనంద్, ఇ.ఇ శంకర్ రావు, డి.ఇ.ఇ శశికళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ప్రసన్న, మత్స్య శాఖ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News