Saturday, November 23, 2024

గ్రీస్‌లో కార్చిచ్చు బీభత్సం..

- Advertisement -
- Advertisement -

ఏథెన్స్ : ఈశాన్య గ్రీస్‌తోపాటు ఏథెన్స్, అలెగ్జాండ్ర పొలిస్‌లోనూ గత తొమ్మిదిరోజులుగా కొనసాగుతున్న కార్చిచ్చు బీభత్సాన్ని నివారించడానికి అనేక ఐరోపా దేశాల నుంచి దాదాపు 600ఫైర్‌ఫైటర్స్ తరలివచ్చాయి. నీళ్లు గుమ్మరించే విమానాలు , హెలికాప్టర్లు గ్రీస్‌లో మూడు భారీ కార్చిచ్చు ప్రాంతాల్లో ఆదివారం మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. వీటిలో రెండు చోట్ల జ్వాలలు గత కొన్నాళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

అలెగ్జాండ్రపొలిస్ ప్రాంతంలో భారీ ఎత్తున అడవులు, నివాస భవనాలు దగ్ధమయ్యాయి. ఆదివారం 295 ఫైర్‌ఫైటర్లు, ఏడు విమానాలు , ఐదు హెలికాప్టర్లు ఈ ప్రాంతంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయని ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. 77,000 హెక్టార్ల అటవీ భూమి , మరో 120 ప్రాంతాలు దగ్ధమయ్యాయని యూరోపియన్ యూనియన్ కు చెందిన కొపెర్నికస్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీస్ ఆదివారం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News