Monday, December 23, 2024

అమెరికా గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు బయలుదేరుతారనగా, గ్రీన్ కార్డు అర్హత నిబంధనలను అమెరికా సరళ తరం చేసింది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే విదేశీయులకు గ్రీన్ కార్డు జారీ చేస్తారు. ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఇఎడి) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూరుతుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానంపై ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో ప్రధాని మోడీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం లోకూడా మోడీ ప్రసంగిస్తారు.

మోడీ గౌరవ సూచకంగా వైట్‌హౌస్‌లో బైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గ్రీన్ కార్డుల జారీ విషయంలో అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) జారీ చేసిన మార్గదర్శకాలు భారతీయ సాంకేతిక నిపుణులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు. అమెరికాలో స్థిరపడాలని కోరుకున్న వారి కల సాకారం చేసుకోడానికి ఈ అవకాశం దోహదం చేస్తుందని చెబుతున్నారు. గ్రీన్‌కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా సడలించిన నిబంధనలు, నూతన మార్గదర్శకాలు వర్తిస్తాయని అమెరికా వెల్లడించింది. అమెరికాలో స్థిరపడాలనుకునే వలస దారులకు అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ (గ్రీన్ కార్డ్ )ఇస్తుంటుంది.

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం ఏటా సుమారు 1,40,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. అయితే ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ (కోటా)లో మాత్రమే వీటిని జారీ చేస్తుంటారు. మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7 శాతం మాత్రమే కేటాయించాలన్నది ప్రస్తుతం అమలులో ఉన్న విధానం. ఈఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనలను సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుందని వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది అజయ్ భూటోరియా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News