Friday, November 22, 2024

లిమ్కా బుక్‌లో గ్రీన్ ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్యధిక మొక్కలు నాటిన సంస్థగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు లభించింది. గతంలో కేవలం ఒక గంట సమయంలో అత్యధిక మొక్కలు నాటిన రికార్డును కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సొంతం చేసుకుంది. సిఎం కెసిఆర్ హరితహారం స్పూర్తితో బిఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ 2018 జులైలో ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. 2021 జూలై 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ఎంఎల్‌ఎ జోగు రామన్న ఆధ్వర్యంలో ఒక గంటలో 16,900 వందల మంది భాగస్వామ్యంతో 3,54,900మొక్కలు నాటారు. దీంతో ఈ రికార్డును లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదైంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు 21మొక్కలు నాటారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా 18 కోట్లకు పైగా మొక్కలు నాటారు. దీంతో భారత ప్రభుత్వం నిర్దేశించిన 33 శాతం అడవుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం దగ్గరిగా ఉంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో చిన్నా పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా పాలుపంచుకుంటున్నారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్, సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్, కంగనా రనౌత్, ఆర్‌ఆర్‌ఆర్ టీం మెంబర్స్, తదితరులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కీసర రిజర్వు ఫారెస్ట్, కరేపల్లి రిజర్వు ఫారెస్టు, ముంబా రిజర్వు ఫారెస్టులను దత్తత తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంను కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. సిఎం కెసిఆర్ సిద్దిపేటకు ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు సిద్దిపేటకు హరితహరం అనే కార్యక్రమం ద్వారా తాను స్పూర్తి పొందినట్టు తెలిపారు. ఇప్పటివరకు కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో 7-9 శాతం పచ్చదనం సంతరించుకుందన్నారు. ప్రధాన నినాదం ప్రజల్లో మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్‌లో మొక్కలను పెంచుతారన్నారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ కు మహారాష్ట్రలో విశేష స్పందన
పండరీపురం విఠలేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన తులసి మొక్కల పంపిణీ
తొలి ఏకాదశి పురస్కరించుకుని రెండు రోజులు మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం పండరీపురంలో విఠలేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన తులసి మొక్కలు వార్కరి సాంప్రదాయకులకు అందజేయడం జరిగింది. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తులసి మొక్కలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోలాపూర్ జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు భగీరథ భారతి బాల్కే పాల్గొని, తులసి మొక్కలను భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా భగీరథ భారతి బాల్కే మాట్లాడుతూ గ్రీన్ ఇండియా సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ దూర దృష్టితో పర్యావరణ పరిరక్షణ పట్ల వీరు తీసుకున్న సంకల్పం అద్భుతమని కొనియాడారు. ఈ సందర్భంగా వార్కరి సాంప్రదాయకులు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తులసి మొక్కలను పంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా సభ్యులు రాఘవ, పర్యావరణ కార్యకర్త పాలడుగు జ్ఞానేశ్వర్ , పూర్ణ, మహారాష్ట్ర వార్కరి సాంప్రదాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

పుట్టిన రోజు.. మొక్కలు నాటిన చొప్పదండి ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్
తన జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గంగాధర మండలం బూరుగుపల్లి తన ఇంటి అవరణలో బిఅర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు, ప్రేమసాగర్ రావు సురేందర్ రెడ్డితో చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవిశంకర్ మొక్కలు నాటారు. ఈ సంద ర్భంగా ఎంఎల్‌ఎ రవిశంకర్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రారంభించిన అధ్భుతమైన పథకం హరితహరం కార్యక్రమంతో తెలంగాణ వ్యాప్తంగా పచ్చని వాతావరణం ఏర్పడిం దన్నారు. అలాగే, దీనికి కొనసాగింపుగా ఎంపి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య క్రమంలో మన రాష్ట్రమే కాకుండా దేశ. విదేశాల్లో కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటుతున్నా రన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన ఎంపి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయినిపల్లీ మండలం ఎంపిపి పర్లపెల్లి వేణు గోపాల్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపిపి నాగయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు లచ్చి రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పలు గ్రామాల సర్పం చులు, ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొని ఎంఎల్ ఎ రవిశంకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News