- Advertisement -
హైదరాబాద్: గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తమ ఉదారతను చాటారు. అవయవాన్ని తీసుకుని వెళ్తున్న అంబులెన్స్‌కు మంగళవారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సహకరించారు. లంగ్స్‌ను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. రెండు ఆస్పత్రుల మధ్య ఉన్న 12కిలో మీటర్ల దూరాన్ని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో ఎనిమిది నిమిషాల్లో చేరుకున్నారు. గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి అవయవదానానికి సహకరించిన పోలీసులను ఆస్పత్రుల యాజమాన్యాలు అభినందించాయి.
- Advertisement -