Thursday, January 23, 2025

నగరంలో గ్రీన్ ఛానల్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం మరోసారి గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి అవయవదానానికి సహకరించారు. లంగ్స్ తీసుకుని వచ్చిన వైద్యులు, టెక్నీషియన్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కిమ్స్ వరకు చేరుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు శంషాబాద్ నుంచి కిమ్స్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి కిమ్స్ మధ్య ఉన్న 35.3 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 27 నిమిషాల్లో చేరుకున్నారు. అవయవాన్ని తీసుకుని మధ్యాహ్నం 2.12 గంటలకు బయలుదేరిన అంబులెన్స్ 2.39నిమిషాలకు ఆస్పత్రికి చేరుకుంది. గ్రీన్ ఛాన్ ఏర్పాటు చేసి అవయవదానానికి సహకరించిన పోలీసులకు ఆస్పత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News