Monday, December 23, 2024

తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7% వృద్ధి : మంత్రి హరీష్‌రావు ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రదేశాలలో తెలంగాణ ఒకటని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో చక్కని గ్రీన్ కవర్ ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ హరితహారాన్ని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. హరితహారంలో అద్భుతమైన ఫలితాలతో 7.7 శాతం వృద్ధిని సాధించామని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ దూరదృష్టి వల్ల ఈ కార్యక్రమం సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 వేల 8వందల 64 నర్సరీలు, 19వేల 4వందల 72 పల్లె ప్రకృతి వనాలు అభివృద్ధి చేశామని స్పష్టీకరించారు. 13.44 లక్షల ఎకరాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 273కోట్ల మొక్కలు నాటించామని తెలిపారు. కెసిఆర్ వంటి నిజమైన పర్యావరణవేత్తకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కొనియాడారు. నేడు తెలంగాణ ఏం చేస్తుందో దేశం అదే అనుసరిస్తోందని మంత్రి హరీష్‌రావు పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News