అదానీ గ్రూపు నిధులతో ఏర్పాటు
లండన్: ప్రతిష్ఠాత్మక లండన్ సౌన్స్ మ్యూజియంలో మన దేశానికి చెందిన అదానీ గ్రూపు సమకూర్చిన నిధులతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఒక గ్యాలరీ ఏర్పాటు కానున్నట్లు మంగళవారం ప్రకటించారు. ‘ఎనర్జీ రివల్యూషన్: ది అదానీ గ్రీన్ ఎనర్జీ’ గ్యాలరీ పేరుతో ఏర్పాటయ్యే ఈ గ్యాలరీ 2023లో ప్రారంభమవుతుంది. మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. భారత్‌లో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో అగ్రసంస్థల్లో ఒకటిగా ఉన్న అదానీ గ్రీన్ ఎనర్జీ 2030 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థగా ఎదగాలని లక్షంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.పర్యావరణ మార్పులను అరికట్టడానికి విద్యుత్ రంగంలో ప్రపంచంలో ఎంత శరవేగంగా మార్పులు వస్తున్నాయో వివరించే లక్షంతో ఈ గ్యాలరీ ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అవసరమైన నిధులను అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ అందజేస్తుంది.