కమలాపూర్: మండల కేంద్రంలో సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా హరితోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎంపిపి తడక రాణి శ్రీకాంత్, జడ్పిటిసి లాండిగ లక్ష్మణ్ రావు, ఎంపిడిఓ పల్లవి ఆధ్వర్యంలో కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో మొదటి సారిగా వినూత్నంగా ప్లాంట్ బాక్స్‌లలో ప్రయోగాత్మకంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. ప్లాంట్ బాక్స్‌లలో నాటిన మొక్కలు 15 రోజుల వరకు నీరు నిల్వ ఉండే విధంగా నాటించినట్లు ఈ ప్లాంట్ బాక్స్‌లో 15 నుండి 20 లీటర్ల వరకు నీరు ఉంటుందని అన్నారు.
ఈ సంవత్సరం ప్రతి కుటుంబం కనీసం 6 నుండి 20 మొక్కలు వరకు తీసుకుని వారి ఇంటి ఆవరణంలో నాటుకోవాలని అన్నారు. అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణి చేసారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, ఎంపిఓ, కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, ఐకెపి సిబ్బంది, అంగన్ వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మహిళలు, కూలీలు పాల్గొన్నారు