Sunday, November 24, 2024

దక్షిణ ట్రిపుల్ ఆర్ కు పచ్చజెండా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మం గళవారం సమావేశమయ్యారు. గడ్కరీని ఆయన అధికారిక నివాసంలో సుమారు గంటన్నరపాటు కొనసాగి న భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, జాతీయ రహదారు ల పనులకు సంబంధించిన వివిధ స మస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, తెలంగాణలోని జాతీ య రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై రేవంత్‌రెడ్డి ము ఖ్యంగా చర్చించారు. అందులో భాగంగా 15రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు నల్గొండ టౌన్‌కు బైపాస్ రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సిఐఆర్‌ఎఫ్ ఫండ్స్ పెంపుదలతో పాటు శ్రీశైలం టు హైదరాబాద్ జాతీయ రహదారికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, రీజనల్ రింగ్‌రోడ్డు దక్షిణ భాగం పనులు.. హైదరాబాద్ టు- కల్వకుర్తి, హైదరాబాద్ -టు విజయవాడ లైనింగ్ పనులకు నిధులు కేటాయించాలని సిఎం రేవంత్ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు నల్గొండలో రవాణా శిక్షణ కేంద్రం ఏర్పాటు అంశాలపై నితిన్ గడ్కరీతో సిఎం చర్చలు జరిపారు.
జాతీయ రహదారి ప్రకటనపై తొలగిన అడ్డంకులు
రీజనల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం (చౌటుప్పల్- టు అమన్‌గల్ టు -షాద్‌నగర్- టు సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించి ప్రస్తుతం అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి, పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి అందజేశారు. ఆయా రహదా రులను జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకత గురించి సిఎం రేవంత్ కేంద్రమంత్రితో వివరించారు. ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్‌హెచ్‌ఏఐకు లేఖ పంపారు.
అధికారుల తీరుపై కేంద్రమంత్రి ఆగ్రహం
యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మెలిక పెట్టినదెవరంటూ అధికారుల తీరుపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్‌లో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని కేంద్రమంత్రి అధికారులతో పేర్కొన్నారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్‌ఐఎఫ్ (కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి సిఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్రం మంజూరు చేసిన కేబుల్ బ్రిడ్జిని మరో చోటుకు మార్చాలని నితిన్ గడ్కరీని సిఎం రేవంత్ కోరారు. వీటితో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై కూడా ఇరువురు చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News