Monday, December 23, 2024

భావితరాల భవిష్యత్తు కోసమే హరితహారం

- Advertisement -
- Advertisement -
  • మొక్కలు నాటడం అందరి బాధ్యత
  • జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు

న్యాల్‌కల్: భావితరాల మనుగడ కోసమే సిఎం కెసిఆర్ గత తొమ్మిది సంవత్సరాలుగా ఉద్యమంలా మరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నారని జహీరాబాద్ ఎంమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు.తెలంగాణ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని హుసెళి గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅథిదిగా హాజరై మెక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ భావితరాలను దృష్టిలో ఉంచుకొని సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం ఉద్యమంలా చేపడుతున్నారని అన్నారు. అందుకు గ్రామాల్లోని అన్ని ప్రదేశాలలో మెక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

సిఎం కెసిఆర్ ముందుచూపుతోనే రాష్టంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గుర్తుచేశారు.మానవ మనుగడకు ప్రాణవాయివు అవసరం ఎంత అవసరమో తెలుసుకోవాలని అన్నారు.అవసరాల కోసం చెట్లను నరకడమే కాకుం డా చెట్లను నాటడం కుడ అలవాటుగా మార్చుకోవాలను కోరారు.అందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని తెలిపారు. అడవుల్లో ఉడవలసిన జంతువులు కోతి,కొండ ముచ్చులు జన వాసాల్లోకి రావడానికి ప్రధాన కారణం అడవులు నశిచిపోవడమే అన్నారు.డిడిఎస్ వ్యవస్గాపకులు డాక్టర్ సతీశ్ పర్యావరణాన్ని కాపాడేందు చేసిన కార్యక్రమాలు అభినందిందగ్గ విషయమని గుర్తుచేశారు.

అలాంటి స్ఫూర్తితోనే అందరు ముదుకెళ్లాలని కోరారు. ప్రముఖ న్యాయవాది ఉద్యమ నాయకులు పాండురంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించక పోవడంవల్లే పర్యావరణం అనేక మార్పులను గమనిష్తునామని అన్నారు. పర్యావరణం వికటించకుండా ముందస్తూ చర్యలు తీసుకోవడంలో సిఎం కెసిఆర్ ముదువరుసలో ఉన్నారని గుర్తుచేశారు. జెడ్‌పిటిసి స్వప్నభాస్కర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్టంలో సిఎం కెసిఆర్ నిర్వహిస్తునారని అన్నారు.

స్వచ్ఛమైన వాయువును అందించి భావితరాలు ఆరోగ్యంగా ఉండేందుకు వీలుగా ముందుచూపును అభినందించదగ్గ విశయమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరు సహకరించి విజయవంతం చేయాలని ఎంపిపి అంజమ్మ కార్యక్రమంలో ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ అధ్యక్షలు మున్నూర్ రవీందర్, దశాబ్ది ఉత్సవాల ప్రత్యేక అధికారి జైదేవ్‌ఆర్య,యంపిడిఒ వెంకట్‌రెడ్డి, ఉప తహశీల్దార్ మునీరోద్దిన్, బిఎల్‌పిఒ రాఘవులు, నీటి పారుదల అధికారి సాబేర్‌హుస్సేన్, గ్రామ సర్పంచ్ సుధారాణి వుంకట్‌రెడ్డి, ఎపిఒ రంగారావు, కార్యదర్శులు నాగభూశణం గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News