Monday, January 6, 2025

షుగర్ ఉన్నవారు తినాల్సిన పండ్లు..

- Advertisement -
- Advertisement -

డయాబెటిస్ ఈ రోజుల్లో సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. ఇది వయసుతో సంబంధం లేకుండా చిన్న ,పెద్ద తేడా లేకుండా వస్తోంది. అయితే డయాబెటిస్ ని పూర్తిగా నయం చేసుకోలేము కానీ, కొన్ని అలవాట్ల వల్ల అదుపులో పెట్టుకోవచ్చు. ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మద్యపానం ధూమపానం మానేయడం తో డయాబెటిస్ ని కాస్త నివారించవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా రక్తంలో షుగర్ వ్యాల్యూస్ పెంచని ఆహారాన్ని వారు ఎంచుకొని తీసుకోవాలి. అయితే ఇప్పుడు డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఐదు పండ్ల గురించి తెలుసుకుందాం.

జామ పండు

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జామ పండులో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఫైబర్ రక్తంలో చక్కెరను నెమ్మదిగా తగ్గిస్తుంది. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ ని ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తుంది. జాములో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

మోసంబి

మోసంబి లో విటమిన్ సి తో పాటు పోలేట్, పొటాషియం ఉంటాయి. ఫోలేట్ కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇక పొటాషియం రక్తపోటు నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా మోసంబీలో తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని వేగంగా పెంచదు.

పియర్

పియర్ లో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ రక్తంలో షుగర్ వ్యాల్యూస్ ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇక విటమిన్ కె ఎముకలను బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా పియర్ లో ఉండే పెక్టిన్ అనేకరిగే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

కివి

కివి పండులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫైబర్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. కివిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్త కణాలను రక్షిస్తాయి. ఇది డయాబెటిస్ రోగులకు ఇది ఎంతో మంచిది.

గ్రీన్ ఆపిల్

గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ ఆపిల్లో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్ ని యంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. అయితే విటమిన్ సి మాత్రం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News