Wednesday, January 22, 2025

భవిష్యత్ ఇంధనం గ్రీన్‌హైడ్రొజన్

- Advertisement -
- Advertisement -

భవిష్యత్ ఇంధనం గ్రీన్‌హైడ్రొజన్ (హరిత ఉదజని). ప్రత్యా మ్నాయ ఇంధన వనరుల్లో భాగంగా గ్రీన్ హైడ్రొజన్ భ విష్యత్ ఇంధనంగా గుర్తింపు పొందింది. ఎలాంటి కాలుష్యా నికి తావు లేకుండా పునరుత్పాదక ఇంధన వనరులైన నీరు, సౌరశక్తి, పవన శక్తి, సముద్ర తరంగాల శక్తి ఆధారంగా ఉత్పత్తి చేసే హరిత ఉదజనినే గ్రీన్‌హైడ్రొజన్‌గా పేర్కొంటారు. నీరు పుష్కలంగా ఉండే రిజర్వాయర్లు, బ్యారేజీలు, పరీవాహక ప్రాంతాల్లో భారీ ఎత్తున కంపెనీలు ఏర్పాటు చేసి నీటి అణువులను ఎలె క్ట్రోలైసిస్ (విద్యుత్ విశ్లేషణ) ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేసి ఆక్సిజన్‌ని, కార్బన్ రహిత హైడ్రొజన్‌ని వేరు చే స్తారు. అప్పుడే కాలుష్యరహిత హరిత ఉదజని ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా 12 లీటర్ల నీటి నుంచి 1 కిలో హరిత ఉదజని ఉత్పత్తి చేయవచ్చు. ఇది 4 లీటర్ల పెట్రోల్ దహన సామర్ధంతో సమానం. అయినప్పటికీ దీని ఉత్పత్తికి ప్రస్తుతం 400 రూపాయలు అవ్వడమే కాక, పెద్ద ట్యాంకులను వినియోగించ వలసి వస్తుంది.

దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతా యి. అందుకే జర్మనీ, స్వీడన్ వంటి దేశాల్లో ఈ గ్రీన్ హైడ్రొజన్‌ని రైళ్లు నడపడానికి వినియోగిస్తున్నారు. 2020లోనే జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటి ఐరోపా ఖం డ దేశాలు గ్రీన్ హైడ్రొజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరాపై జాతీయ హైడ్రొజన్ స్ట్రాటజీని తీసుకు వచ్చాయి. 2021లో అమెరికా ఇటువంటి వ్యూహ రచనకు 9.5 బిలియన్ డాలర్లు (75 వేల కోట్లు) కేటాయించింది. 2030 నుండి ప్రతిఏటా 20 మిలియన్ టన్నుల గ్రీన్‌హైడ్రొజన్‌ని ఉత్ప త్తి చేస్తే కానీ కాలుష్యాన్ని గణనీయంగా అదుపులోకి తీసుకు రాలేమని అభివృద్ది చెందిన దేశాలు లక్షంగా పెట్టుకున్నాయి. భారత దేశ ప్రభు త్వం కూడా ముందు చూపుతో భావి తరాలకు ఇంధన సంక్షోభం తలె త్తకుండా ఉండడానికి 2023 జనవరి మొదటి వారంలో జాతీయ హరిత ఉదజని మిషన్ ను ఏర్పాటు చేసింది. ఈమేరకు మౌలిక సదుపాయాలకు, పరిశోధనలకు 18వేల కోట్లు కేటాయించ డం శుభ పరిణామం.

2030 నాటికి 5మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలని మనదేశం లక్షంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా, సము ద్ర జలాలతో హైడ్రొజన్ ఉత్పత్తి చేసే కొత్త విధానాన్ని ఐఐటి మద్రాస్ కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. సౌర విద్యుత్‌తో ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. పరిశోధనలో భాగంగా సెల్యులోజ్ ఆధా రిత సెపరేటర్ కలిగి ఉన్న ఎలెక్ట్రోలైజర్‌ను పరిశోధకులు ఉపయోగిం చారు. 391చదరపు సెంటీమీటర్ల ఎలెక్ట్రోలైజర్‌ను వినియోగించి గంటకు ఒక లీటర్ హైడ్రొజన్ ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు తెలిపారు. దీనికి కావల సిన ఎలెక్ట్రోలైజర్లను భారత్‌లో చాలా కొద్ది కంపెనీలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో అమె రికా, ఐరోపాల కన్నా 75 శాతం తక్కువ ధరకు చైనా ఎలెక్ట్రోలైజ ర్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో 60నుంచి 100గిగావాట్ల ఎలెక్ట్రోలైజర్ సామర్థంతో హరిత ఉదజని ఉత్పత్తి కర్మాగారాలను నెలకొల్పాలని భారత్ తలపెట్టింది.

అయితే ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు హరిత ఉదజని ఉత్పత్తి కోసం చొరవ చూపిస్తున్నాయి. కేరళ ప్రభుత్వం కూడా కొచ్చి నగరం చుట్టుపక్కల 50కిమీ పరిధిలో హరి త ఉదజని ఉత్పత్తి, నిల్వ, వినియోగానికి ప్రణా ళికలు రూపొంది స్తోంది. ఇక గాలిలో తేమ నుంచి నిరంతరం విద్యుత్ ను సేకరించేం దుకు శాస్త్రవేత్తలు మార్గాన్ని కనుగొన్నారు. ఇంతకంటే త క్కువగా ఇంకేదీ లభ్యం కాదని చెబుతున్నారు. తేమలోని సూక్ష్మ నీటి బిందు వుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని నమ్ముతున్నారు. భూమి లో లభ్యమయ్యే అరుదైన ఖనిజ నిక్షేపాలు హరిత ఇంధన ఉ త్పాద క పరిజ్ఞానంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఎలెక్ట్రానిక్ రంగం లో లిథియం వంటి ఖనిజాలకు గిరాకీ పెరుగుతుండగా, నియోడిమియ మ్, డిస్‌ప్రోసియం, ప్రేసియోడిమియం వంటి అరుదైన మూలకాలు పవన విద్యుత్ టర్బైన్లు, విద్యుత్ వాహన మోటార్లలో కీలకంగా ఉంటున్నాయి. విద్యుత్‌ఛ్ఛక్తి నిల్వకు బ్యాటరీలోలిథియం, కోబాల్ట్ , నికెల్ వినియోగిస్తారు. ఇలాంటి అరుదైన సంక్లిష్ట మూలకాలు , ఖనిజాలు హరిత ఇంధన ఉత్పత్తిలో ప్రాధాన్యం వహిస్తున్నాయి.

ప్రపంచంలో గ్రీన్‌హైడ్రొజన్ విద్యుత్ సాంకేతికతపై చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. భారత్ కూడా ఈమేరకు తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అప్పటికి వందేళ్ల సంబరాలు జరుపుకొనే సమయానికి పర్యావరణానికి హానిలేని విద్యుత్ రంగాన్ని సాధించాలన్న లక్షం పెట్టుకుంది. ఈమేరకు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఈ లక్షం వైపు ముందుకెళుతోంది. ఇందులో భాగంగా వివిధ పరిశోధక సంస్థలతో గ్రీన్ హైడ్రొజన్‌పై పరిశోధనలు చేయిస్తోంది. ఇందులో పాలుపంచుకోవాలని ఐఐటి మద్రాస్, తమిళనాడు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి కే 50 శాతం విద్యుత్ పర్యావరణ హితంగా ఉందని, మిగతా భాగా న్ని గ్రీన్ హైడ్రొజన్‌తో భర్తీ చేస్తామని తమిళనాడు ప్రభుత్వం చెబు తోంది. గ్రీన్ హైడ్రొజన్‌పై మక్కువ చూపించే అంకుర పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కల్పించడానికి కేంద్రం మొగ్గు చూపుతోంది. చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) భారత్‌లో తొలిసారిగా గ్రీన్‌హైడ్రొజన్‌తో నడిచే బస్సులను సెప్టెంబర్ 25 (2023) న ఆవిష్కరించింది. హైడ్రొజన్ మండినప్పుడు ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరి మాత్రమే ఈ బస్సు విడుదల చేస్తుంది.

30 కిలోల గ్రీన్ హైడ్రొజన్ సామర్థం ఉన్న నాలుగు సిలిండర్లతో ఈ బస్సు 350 కిమీ ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి ఢిల్లీ రోడ్లపై ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. ఒక కిలో గ్రీన్ హైడ్రొజన్ ఉత్పత్తికి 50 యూనిట్ల పునరుత్పాదక విద్యుత్, 9 కిలోల డీయోనైజ్డ్ నీరు అవసరం. 2023 చివరినాటికి ఐఒసి ఖాతాలో ఈ బస్సుల సంఖ్య 15 కు చేరుతుందని తెలుస్తోంది.
హరిత ఇంధన లక్షాలు భారత దేశానికి సంబంధించి హరిత ఇంధన వినియోగం విషయంలో సాధించవలసిన లక్షాలు కొన్ని ఉన్నాయి. మొదట ఇంధన భద్రత అభివృద్ధి చేయాలి. అలాగే హరిత ఇంధన అనుసంధానం త్వరిత గతిన కల్పించాలి. వీటికి తోడు వాతావరణ మార్పులను అదుపు చేయాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం భారత్. భారత్ లోని జనాభా తలసరి కర్బన ఉద్గారాలు 1.8 టన్నులు కాగా, చైనాలో 7. 6 టన్నుల వరకు ఉంది. 2015లో ప్యారిస్‌లో కాప్ 21 సదస్సులో2030 కన్నా ముందుగానే శిలాజేతర ఇంధనాల నుంచి 40 శాతం వరకు ఇంధన ఉత్పత్తి సామర్ధాన్ని సాధిస్తామని భారత్ ప్రకటించింది.

2070 నాటికి జీరో స్థాయిలో కర్బన కాలుష్యాలు ఉండేలా లక్షాన్ని సాధించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. పర్యావరణ హిత ఇంధన పరివర్తన వైపు మొగ్గు చూపే దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సంసిద్ధతను ప్రకటించింది. ఈ మేరకు ముమ్మరంగా దేశాలన్నీ కలిసి ప్రయత్నా లు సాగిస్తేనే కానీ మితిమీరుతున్న భూతాపాన్ని నివారించలేమని జి20 సదస్సులో దేశాలు పేర్కొన్నాయి. గత ఏడాది ప్రపంచ దేశాల నుంచి రికార్డు స్థాయిలో 300 గిగావాట్‌ల పునరుత్పాదక విద్యుత్ శక్తి వచ్చి చేరింది. ప్రపంచం మొత్తం మీద ఇంధన ఉత్పాదక సామర్ధంలో 40 శాతం వరకు హరిత ఇంధనం ఉంటోందని ఇంట ర్నేషనల్ రెన్యుబుల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్ మించకుండా అదుపు చేయాలంటే పునరుత్పాదక ఇంధన వినియోగం ఏటా వెయ్యి గిగావాట్ల వరకు సాధించవలసి ఉందని సూచించింది.

ఇటీవల నిర్వహించిన జీ20 దేశాల సదస్సులో కూడా గ్రీన్ ఎనర్జీకి దేశాల నుంచి మద్దతు భారీగా లభించింది. బాగా అభివృద్ధి చెందిన దేశాల వైఖరి ఎలా ఉన్నా 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక శక్తి (ఇంధన) సామర్థాన్ని మూడు రెట్లు ఎక్కువగా సాధించాలని తీర్మానించాయి. కర్బనాల నుంచి వెలువడుతున్న బొగ్గు కాలుష్యాలు విపరీతంగా పెరిగిపోతు న్నందున అభివృద్ధి చెందిన దేశాల వైపు నిరీక్షించకుండా ఈ కాలుష్యాలను నివారించడానికి ముందడుగు వేయాలని తీర్మానించాయి.

కె. యాదగిరి రెడ్డి
9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News