Wednesday, January 22, 2025

ప్రకృతి అందాలను ఆస్వాదించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి : ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పర్యావరణ, జంతు ప్రేమికుడైన ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ వీకెండ్‌లో అరుదైన పర్యావరణ సంబంధిత ఇమేజ్‌లతో పాటు అరుదైన పక్షులను ఆయా ప్రదేశాలకు వెళ్లినప్పుడు తన కెమెరాలో బంధిస్తూ వుంటారు. ప్రకృతి రమణీ యతను ఆస్వాదిస్తూ వీకెండ్ సమయంలో ప్రకృతికి సంబంధించి, అరుదైన పక్షులకు సంబంధించిన చిత్రాలను తన కెమెరాలో నిక్షిప్త పరుస్తుంటారు. అలాంటి అరుదైన దృశ్యాలను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ప్రజల్లో పర్యావరణ, ప్రకృతి పట్ల మరింత ఆరాధనా భావాన్ని పెంపొందింపజేస్తుంటారాయన. ఈ క్రమంలో ఈ వీకెండ్‌లో ఆయన కొన్ని పక్షుల చిత్రాలను తన ట్విట్టర్‌లో పొందుపర్చారు. ప్రకృతి అందాలను ఆస్వాదించాలి, అదే విధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News