Monday, December 23, 2024

మొక్కలు నాటిన డిసిపి శిల్పవళ్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించబడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగు తుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ ఎస్‌పి ప్రవీణ్‌కుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను డిసిపి శిల్పవళ్లి స్వీకరించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని డిసిపి కార్యాలయంలో తన కొడుకు ప్రణవ్ పుట్టినరోజు సందర్బంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శిల్పవళ్లి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇప్పుడున్న కాలుష్యాన్ని నివారించాలి అంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో గొప్పదని, రేపటి తరాల పిల్లలుకు పచ్చదనం ఆస్తిగా ఇవ్వాలన్నారు. పిల్లలకు మొక్కలు వాటి ఉపయోగాల గురించి తెలియ జేయడం మన బాధ్యత అన్నారు. పోలీస్ స్టేషన్‌కు విజిట్‌కి వచ్చిన హెచ్‌సీయూ జర్నలిజం విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యారు. శిల్పవళ్లి పరిధిలో ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిసిపి శిల్పవళ్లి రమా రాజేశ్వరి, నల్గోండ ఎస్‌పి ఆనంద్ శంకర్ జయంత్ ప్రముఖ డ్యాన్సర్ వీరిని కూడా మొక్కలు నాటాలని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో ఎడిసిపి నర్సింహారెడ్డి, ఎసిపి రఘునందన్, సిఐ సురేష్, సిఐ సునీత, సిఐ శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News