Monday, November 25, 2024

6300 కిలోమీటర్లు సైక్లింగ్…. ప్రకృతిపట్ల ప్రేమ ఉంటే తప్ప సాధ్యం కాదు…

- Advertisement -
- Advertisement -

“జీవితంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి.. అందులో మొక్కలు నాటాలి, నేల బాగుండాలి, ప్రకృతిని కాపాడాలి అనుకునేవారిది అభ్యుదయమైన మనస్తత్వం అందుకోసం వారు ఎంతదూరమైన వెళ్తారు. జీవితంలో ఏం చేయడానికైన సిద్ధపడతారు” అన్నారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అలాంటి వాళ్లలో ప్రముఖ సైక్లిస్ట్ మోహిత్ నిరంజన్, దివ్యాంగ గ్రీన్ ఎంటర్ ప్రెన్యూర్ చంద్రకాంత్ సాగర్ లది ప్రత్యేకమైన ప్రస్థానమని వారిని ప్రశంసించారు. బేగంపేటలో ఈ ఇద్దరితో కలిసి మొక్కలు నాటిన సంతోష్ కుమార్ వీరిని ఘనంగా సత్కారించారు.

Also Read: విశాఖలో టెన్షన్ టెన్షన్

మోహిత్ నిరంజన్, 21 ఏళ్ల ఒక నవ యువకుడు.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” స్పూర్తితో సేవ్‌సాయిల్ & సస్టైనబిలిటీ గురించి అవగాహన కల్పించేందుకు ఉత్తరప్రదేశ్‌ నుంచి మొదలుపెట్టి ఏడున్నర నెలల నుండి భారతదేశం అంతటా 6300 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం మాటల్లో వర్ణించలేనిదని.. ప్రకృతిపట్ల అపారమైన ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని జోగినిపల్లి అన్నారు.

“ఆశయం గొప్పదైతే.. ఆటంకాలను అవలీలగా దాటవచ్చని నిరూపించాడు చంద్రకాంత్ సాగర్.. తాను దివ్యాంగుడైనా చక్రాల కుర్చీకే పరిమితం అని తెలిసినా.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అనునిత్యం శ్రమిస్తున్నాడని సంతోష్ కుమార్ అభినందించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా నాన్ వోవెన్ సంచులను తయారుచేసే సంస్థను ఏర్పాటు చేసి తనతో పాటు మరికొంత మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూ సకలాంగులకు సైతం ఆదర్శంగా నిలిస్తున్నాడని అభినందించారు.

అనంతరం మాట్లాడిన సైక్లిస్ట్ మోహిత్ నిరంజన్.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కల ఉద్యమం తనను కదిలించిందని. మొక్కలు నాటడం వల్ల అందరికి మేలు జరుగుతున్నప్పుడు సంతోష్ కుమార్ ఒక్కరే ఇంత శ్రమ ఎందుకు పడాలని నా మనసు ప్రశ్నించిందని. దీంతో *“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” స్పూర్తితో సేవ్ సాయిల్ థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇషా వాలంటీర్లు శైలజ,రాఘవ్, వికాస్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News