Friday, December 20, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -
మొక్కలు నాటిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంత్

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరించి గురువారం కలెక్టరెట్‌లో మొక్కలు నాటామన్నారు. అలాగే తన వంతుగా మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నానని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ వరంగల్ జిల్లా కలెక్టర్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌లకు మొక్కలు నాటాలని తెలిపారు.

‘మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరంక్షించాలి…’
తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఎంపి సంతోష్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తెలంగాణ భవన్ ఆవరణలో బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భవన్ సెక్రెటరీ, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. సిఎం కెసిఆర్ చేపట్టిన హరితహారం, ఎంపి సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పచ్చదనం పెరిగిందన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్య క్రమంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు నాటిన నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు..
రాజ్యసభ సభ్యు లు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని జిల్లా కేంద్రంలో నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. మొక్కలు నాటిన వారిలో నిజామాబాద్ జిల్లా నార్త్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ పద్మరావు,ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏవి.సురేష్,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మంజులత తదితరులున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News