Monday, December 23, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది : నటి నవీన రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణాన్ని కాపాడుకోవలసిన భాద్యత మన మీద ఎంతయినా ఉందని నటి నవీన రెడ్డి అన్నారు. ప్లాస్టిక్‌ని విడనాడి జూట్ బ్యాగ్స్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ వాడాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం కానీ ప్లాస్టిక్‌ని నియంత్రించే విధంగా చేపట్టే కార్యక్రమాలు రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరమయిన విధంగా పని చేయడం తనకు ఎంతో నచ్చిందన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News