Thursday, January 23, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది : సింధు తపస్వి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తన జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పాల్వంచలోని మున్సిపల్ కార్యాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అంతర్జాతీయ క్రీడాకారిణి సింధు తపస్వి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సింధు తపస్వి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపురావడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఎంపి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మొక్కలు నాటడమే కాకుండా,  వృక్షాలను కూడా రక్షించడం చాలా గొప్ప కార్యక్రమం అని.. ఈ సందర్భంగా తనకి అవకాశం కల్పించిన ఎంపి సంతోష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ ఫరీద్, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, చిరంజీవి, మెగా ఫ్యాన్స్ అసోసియే షన్ అధ్యక్షుడు కాసిం కరాటే అఖిల్ మహర్షి ఇమ్రాన్ మధు యాదవ్ హాసిఫ్ ఆదిల్ బిపిన్ రెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News