Thursday, January 23, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం: సూర్య

- Advertisement -
- Advertisement -

Green India Challenge Great Event: Surya

 

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ నటుడు సూర్య తన నూతన చిత్రం ఈటీ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో హైటెక్ సిటీ వెస్ట్ ఇన్ హైదరాబాద్ హోటల్‌లో నటుడు సూర్యను మర్యాదపూర్వకంగా కలిసి వృక్షవేదం పుస్తకాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ బహుకరించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వృక్షాల గొప్పతనం తెలియజేసేలా రూపొందించిన వృక్షవేదం పుస్తక విశేషాలను సూర్యకు రాఘవ వివరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడిన సూర్య ఈ సందర్భంగా ఎంపి సంతోష్‌కి అభినందనలు తెలిపారు. వృక్షాల గొప్పతనం తెలియజేసేలా రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News