Saturday, January 25, 2025

అస్సాంలో గ్రీన్ ఇండియా చాలెంజ్… కోటి మొక్కలు నాటడమే లక్ష్యం.

- Advertisement -
- Advertisement -

ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటుతున్న స్థానికులు.

ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్బంగా 74 మొక్కలు నాటే కార్యక్రమం

దిస్ పూర్: హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అస్సాంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 కల్లా అస్సాంలో ఒక కోటి మొక్కలు నాటాలనే టార్గెట్ తో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పనిచేస్తోంది. ఈ బృహత్ కార్యక్రమంలో స్థానిక సంస్థలు, ఎన్జిఒలు, పౌరులను భాగస్వామ్యం చేస్తోంది. తాజాగా నగాన్ జిల్లా పామ్ గోన్ గ్రామంలో స్థానికులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఒకే చోట 74 మొక్కలను నాటారు. పర్యావరణ రక్షణ కోసం అమ్మ పేరు మీద మొక్కలు నాటి సంరక్షించాలన్న ప్రధాని ఆంకాక్షను అమలు చేస్తామని ఈ సందర్భంగా స్థానికులు పేర్కొన్నారు.

పద్మశ్రీ, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందిన జాదవ్ పయంగ్ స్ఫూర్తితో మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి మొక్కల కార్యక్రమానికి తమ మద్దుతు ఉంటుందని అస్సామీలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు క్రమంగా రుతువుల మార్పులకు కూడా కారణం అవుతున్నాయని సంతోష్ కుమార్ అన్నారు. ఈశాన్య హిమాలయాలతో పాటు అసోం, ఈశాన్య రాష్ట్రాలకు పర్యావరణ ముప్పు పొంచి ఉందన్న శాస్త్రవేత్తల అంచనాను ఆయన గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, సంరక్షిస్తే పర్యావరణ మార్పులను అడ్డుకోవచ్చన్నారు. ఇందుకోసం స్థానికులు మద్దతును తీసుకుంటున్నామన్నారు. అసోంలో కోటి మొక్కల కార్యక్రమాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో మొదలు పెట్టి ఇప్పటిదాకా రెండున్నర లక్షల మొక్కలు నాటామని కార్యక్రమంలో పాల్గొన్న ఇగ్నైటింగ్ సంస్థ వ్యవస్థాపకులు కరుణాకర్ తెలిపారు. అన్నిటినీ జియో ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నామని, 98 శాతం మొక్కలు బాగా ఎదుగుతున్నాయని ఆయన అన్నారు.

విపరీత వాతావరణ మార్పుల ప్రభావం వల్ల అసోం ఇప్పటికే అకాల వరదలు, సారవంతమైన భూమిని కోల్పోవటం, ప్రజల అనారోగ్యాల బారిన పడటం లాంటి సమస్యలను ఎదుర్కోంటోందని, వీటి నియంత్రణకు ప్రకృతి పునరుద్దరణ కార్యక్రమాలే మార్గమని కార్యక్రమంలో పాల్గొన్న స్వచంద సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీతురాజ్ పుకాన్, రోసీ దేవి, వాలంటీర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News