Monday, December 23, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రాజ్యసభ సభ్యులు, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు శుక్రవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని తన ఇంటి ఆవరణలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్‌రావు, ప్రేమ్‌సాగర్‌రావు, సురేందర్‌రెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బొయినిపల్లి మండలం ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లచ్చిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొని ఎమ్మెల్యే రవిశంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News