Tuesday, September 17, 2024

మొక్కలు నాటి కాపాడటం మనబాధ్యత

- Advertisement -
- Advertisement -

Green india challenge: Jaipal plant tree

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఖాళీ ప్రదేశాలు ఎక్కడ ఉన్నా అక్కడ మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమివేయాలని సుప్రసిద్ధ తబల విద్వాంసుడు జైపాల్ రాజ్ చెప్పారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ 3వ దశలో భాగం గా గాయకుడు దినకర్ చేసిన సవాల్‌ను జైపాల్ రాజ్ స్వీకరించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కొడుకు ఎబి నేజర్ పాల్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలు నాటడమే ఉత్తమమైన మార్గమన్నారు. ఖాళీ ప్రదేశాల ఎక్కడ ఉన్నా మొక్కలు నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గాయకులు విజయలక్ష్మీ, కౌసల్య, రమణ, లీనస్, సంగీత దర్శకుడు, నటుడు ఆర్‌పి పట్నాయక్‌కు సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

కాలుష్యం లేని దేశంగా తీర్చిదిద్దాలి

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా రేడియో జాకీ చైతు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి రేడియో జాకీ కాజల్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో కాజల్ మాట్లాడుతూ కాలుష్యం లేని భారతదేశం నిర్మించాలంటే అందరూ మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా కాజల్ గాయని లిప్సిక, అలీ రాజా బిగ్ బాస్2, నటి సుష్మ కిరణ్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

మొక్కలు నాటి సంరక్షించాలి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో అడవిశేషు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఖాజాగూడాలోని తన నివాసంలో మేజర్ సినిమా దర్శకుడు శశి మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన స్నేహితులు శరత్‌చంద్ర, అనురాగ్ మారెడ్డి మొక్కలు నాటాలని సవాల్ చేశారు.

వాతావరణం పరిరక్షణ కోసం ఎంతో నేర్చుకోవాలి

రేడియో జాకి కాజల్ చేసిన సవాల్‌ను స్వీకరించి జూబ్లిహిల్స్ పార్క్‌లో యువ గాయని లిప్సిక మొక్కలు నాటారు. వాతావరణ పరిరక్షణ కోసం ఎంతో నేర్చుకోవాలని ఆమె చెప్పారు. వాతావరణం బాగుంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు. గ్రీన్‌ఇండియా లో భాగంగా గాయని చాగంటి సాహితి, యాంకర్ విజె శర్మిలకు లిప్సిక గ్రీన్ ఛాలెంజ్ చేశారు.

వాతావరణంలో సమతుల్యం అవసరం

వాతావరణంలో వచ్చే మార్పులను గమనించి మొక్క లు నాటాలని వికారాబాద్ ఎస్‌పి నారాయణ చెప్పారు. గ్రీన్‌ఇండియా 3వ విడతలో ఆయన వికరాబాద్‌లో విస్తృతంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్‌పి నారాయణ వికరాబాద్ జిల్లాకలెక్టర్, ఎంఎల్‌ఏ ఆనంద్ మెతుకు, అడిషనల్ ఎస్‌పిలకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News