Friday, January 10, 2025

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న సింగర్ సునీత..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో సింగర్ సునీత బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావితరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి సునీత గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

Green India Challenge: Singer Sunitha sapling plants

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News