Saturday, December 21, 2024

ఐదో ఏడాదిలోకి అడుగిడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునిక జీవన విధానంలో మనం భూమిపై భారీ భారం మోపుతున్నాం. భూమి మీద మనిషి చేస్తున్న చేష్టలు వినాశకరంగా మారుతున్నాయి. తల్లి భూదేవిని ప్రతి బిడ్డ కాపాడుకోవాలి. అందరి కోసం ధరిత్రి.. ధరిత్రి కోసం అందరు పనిచేయాలి. పుడమి తల్లిని పచ్చగా కళకళలాడేలా చేసుకోవాలని, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కొందరే భావిస్తారు. దృఢంగా ముందుకెళ్తారు. ఆ కొందరిలో ఒక్కరే జోగినపలి సంతోష్ కుమార్. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఏ కార్యక్రమం చేపట్టినా అది దాదాపు ప్రకృతికే సంబంధించే ఉంటుంది. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ఎంపి సంతోష్ కుమార్ చేస్తున్న కృషిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. పచ్చదనం ఆవశ్యకతను చాటిచెబుతూ ఆయన చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ మహా ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.

Green India Challenge Successfully Completed 5 Years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News