Monday, December 23, 2024

ఆకుపచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : భావి తరాలకు ఆకుపచ్చని హరిత తెలంగాణను అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషిచేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని మండలంలోని అచ్యుతాపురం బీట్‌లో జరిగిన హరితదినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మెచ్చా మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా అవకాశం ఉన్న చోటల్లా మొక్కలను నాటి సంరక్షించడంతో ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో అనూహ్యంగా పచ్చదనం పెరిగిందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కాలుష్య నివారణకు పచ్చని చెట్లతో చెక్ పెట్టడంతో పాటు వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు చెట్ల పెంపకం ఎంతో అవసరమని కెసిఆర్ ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ హరితహారం పథకం కోసం ప్రతీ గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి పలు రకాల చెట్లను పెంచే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

నేడు నాటిన చెట్లే భవిష్యత్ తరాలకు ఎంతో భరోసా కల్పిస్తాయని అన్నారు. ప్రతీ ఒక్కరూ నాటిన మొక్కలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి, బండి పుల్లారావు, యుఎస్ ప్రకాషరావు, మోహన్‌రెడ్డి, దమ్మపేట జెడ్పీటిసి పైడి వెంకటేశ్వరావు, ఎంపిపి సోయం ప్రసాద్, ఎఫ్‌డిఓ తిరుమలరావు, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News