Monday, December 23, 2024

హరితాద్రి

- Advertisement -
- Advertisement -

ఆధాత్మిక హరిత పుణ్యక్షేత్రం అవార్డు దక్కించుకున్న యాదగిరిగుట్ట

ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించిన ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’
పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, సౌకర్యాల కల్పనలో అద్భుత కృషి ఫలితం
రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవంగా అభివర్ణించిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి 20222025 సంవత్సరాలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు లభించింది. ‘ఇండియ న్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ఈ అవార్డును ప్రకటించింది. 13వ శతాబ్దానికి చెందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ దేవాలయ స్వయం భూ పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వ యంభువుని ఏమాత్రం తాకకుండా ఆలయప్రాశస్త్యాన్ని కాపాడుతూ నిర్మా ణం చేపట్టినందుకు ఈ అ వార్డు లభించింది. ఆలయం లోపలి వెలుపలి ప్రాంగణంలో శిలలను సంరక్షణ చేయడంతో పాటు నూటికి నూరు శాతం సెంట్రల్ ఎయిర్ కండిషన్ విధానంతో పాటు ఆ లయ వాహిక (డక్టింగ్) నిర్మాణాలు తదతర సుందరీకరణ పనులను అత్యంత అద్భుతంగా చేపట్టినందుకు గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డును ప్రకటిస్తున్నట్లు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వెల్లడించింది. అలాగే ఆలయ గోడలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చేపట్టినందుకు, ప్రత్యేక సూర్య వాహిక ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ కాంతి ప్రసారం జరిగేలా ప్రత్యేక నిర్మాణం చేసినందుకు, భక్తుల రద్దీ విపరీతంగా ఉండే సమయంల్లోనూ స్వచ్ఛమైన గాలి నలుదిశలా ప్రసరించేలా వెంటిలేటర్లు కిటికీల ఏర్పాటుతో పాటు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ నిర్మాణాలను పూర్తిగా కృష్ణశిలతో నిర్మించడం తద్వారా సహజరీతిలో వేడిని తగ్గించడంతో శీతలీకరణ భారం తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు నందించడం వంటివి చాలా బాగున్నయని ప్రశంసించింది. ఇక విస్తారమైన పచ్చదనంతో కూడుకున్న పరిసరాలు వేడి ప్రభావాన్ని చాలావరకు నివారించే విధంగా తీసుకున్న చర్యలు, స్వచ్ఛమైన తాగునీటి లభ్యతను అందుబాటులో ఉంచడం, భక్తుల అవసరాలకు సరిపోయే చెరువులను నిర్మించడం, భక్తుల వాహనాలకు తగిన పార్కింగ్ స్థలాలను కేటాయించడం, భక్తుల రవాణా నిమిత్తం నిరంతర సేవలను అందుబాటులోకి తేవడం వంటి నిబంధనలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించడం జరిగిందని అవార్డు ప్రకటించిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవం
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం అవార్డ్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం సంతోషకరమన్నారు. స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సిఎం పేర్కొన్నారు. తెలంగాణ దేవాలయానికి ‘ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం’ అవార్డు రావడం, ప్రజల మనోభావాలను, మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరి గుట్ట పునర్నిర్మాణం, భారతీయ ఆధ్యాత్మిక పునురుజ్జీవన వైభవానికి నిదర్శనంగా నిలిచిందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తెలిపారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులను ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్రశంసించడం తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవమని సిఎం అన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా పునఃప్రతిష్ఠ చేసిందన్నారు.  తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లేలా యాదగిరి పంచ లక్ష్మీనరసింహ స్వామి కృపాకటాక్షాలు ప్రజలపై ఉండాలని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా ప్రార్ధించారు.

Green Place of Worship Award for Yadagirigutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News