Monday, December 23, 2024

పదేండ్లకు చేరుకున్న హరిత ప్రగతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో హరిత ప్రగతి పదేండ్లకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో..
హరిత హారంను ఒక సారి ఆత్మావలోకనం చేసుకుంటే…. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక అస్థిత్వం కోసం ఆరాటపడిన తెలంగాణ, రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పునర్ నిర్మాణ ఎజెండాను సిద్దం చేసుకుంది. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందకు నడుం కట్టింది. సంక్షేమం, అభివృద్ది పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన పచ్చని ప్రాంతంగా మార్చాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తలచారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే తెలంగాణకు హరితహారం.

రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రాధాన్యతా పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటి. మన వారసులకు, రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్చమైన గాలిని, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది. ఇలా ఆలోచించటంతో పాటు, ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు దక్కింది. తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలో ప్రతీ మదికీ ఎక్కేలా చేయటంలో ముఖ్యమంత్రి సఫలం అయ్యారు. ఆ కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కళ్ల ముందు ఆకు పచ్చగా పరుచుకున్నాయి. ఇన్నేళ్లుగా నాటిన మొక్కలు చెట్లుగా మారి ఆక్సీజన్ తో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇలా రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లివిరియాలంటే తెలంగాణకు హరితహారం నిరంతర ప్రక్రియలా కొనసాగాల్సి ఉంది. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ మన జీవన విధానంలో భాగం కావాల్సిన ఉంది.

హరితహారం ఫలితాలు 2015 -23 వరకు ఇలా..
* ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటడం జరిగింది
* రాష్ట్ర వ్యాప్తంగా 14, 864 నర్సరీల ఏర్పాటు.
* హరితహారం నిర్వహణ కోసం ఇప్పటిదాకా 10,822 కోట్ల వ్యయం.
* 19, 472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు. (13,657 ఎకరాల్లో)
2,011 బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు. (6,298 ఎకరాల్లో) రాష్ట్రం అంతటా 1,00, 691 కిలో మీటర్ల మేర రహదారి వనాలు.
* ఇందులో 12,000 కిలో మీటర్లు బహుళ రహదారి వనాలు.
* పర్యావరణ అవగాహన కోసం స్కూలు పిల్లలకు విసృతంగా వనదర్శిని కార్యక్రమం అటవీశాఖ చేపట్టింది.
తొమ్మిదేళ్లలో అటవీ పునరుద్దరణ ద్వారా సాధించిన విజయాలు
అటవీశాఖ అధికారులు 13.44 లక్షల ఎకరాల అటవీ పునరుద్దరణ, 2.03 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశారు.
* 24. 53 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
* పునరుద్దరణ ద్వారా పెరిగిన మొక్కలు 53.84 కోట్లు. 10,886 కి.మీ. మేర అటవీ ప్రాంతాల చుట్టూ కందకాల తవ్వకం.
అగ్ని ప్రమాదాల నివారణ కోసం 21,452 కి.మీ. మేర ఫైర్ లైన్లు ఏర్పాటు చేశారు.
* నేల , తేమ పరిరక్షణ (Soil & Moisture Conservation) కోసం అడవుల్లో పెద్ద ఎత్తున నీటి యాజమాన్య పద్దతుల అమలు. చెక్ డ్యాములు, ఇంకుడు చెరువులు/ కుంటలు మొదలైనవాటి నిర్మాణం పూర్తి చేశారు.

* పట్టణ ప్రాంత అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) హరిత వనాలు ఇలా..

* రాష్ట్ర వ్యాప్తంగా నగరాలకు సమీపంలో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు. దాదాపు 75, 740 ఎకరాల్లో ఈ పార్కుల అభివృద్ది చేశారు.
* 164 హరిత వనాల్లో వంద శాతం పచ్చదనం సాధించేందుకు 1.71 లక్షల ఎకరాల్లో 1.06 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
* గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో హరితహారం అమలు చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) నివేదిక ప్రకారం హరితహారం వల్ల గ్రేటర్ పరిధిలో గత పదేళ్లలో గ్రీన్ కవర్ భారీగా 147 శాతం పెరిగింది. సుమారు ఏడు కోట్ల మొక్కలు నాటడంతో పాటు, కొత్తగా 456 కాలనీ పార్కుల అభివృద్ది. 1120 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్, 115 చోట్ల యాదాద్రి మోడల్ లో (మియావాకి) పచ్చదనం పెంపు.
చేయడం జరిగింది
* గ్రేటర్ పరిధిలో పది శాతం గ్రీన్ బడ్జెట్ కింద పచ్చదనం పెంపు కోసం సుమారు ఏడు వందల కోట్ల కేటాయింపు చేశారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో హరితహారం – విజయాలు ఇవీ…
* సుమారు పన్నెండు కోట్ల మొక్కలు (11.93 కోట్లు) నాటడం జరిగింది.
* ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్ ఛేంజ్ లు, సర్వీస్ రోడ్లు, పార్కులు పచ్చదనంతో హైదరాబాద్ కు మణిహారంగా మారాయి.
* హైదరాబాద్ చుట్టూ ప్రకృతి రమణీయంగా 16 అర్బన్ ఫారెస్ట్ పార్కులను హెచ్‌ఎండిఏ డెవలప్ చేసింది.
* గ్లోబల్ సిటీగా మారిన హైదరాబాద్, హెచ్‌ఎండిఏ కృషి వల్లే గ్రీన్ సిటీ ఆఫ్ వరల్ గానూ మన్ననలు అందుకుంటోంది.
ఈ క్రమంలోనే ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ విజయవంతమైన సంస్థగా ఎదిగింది. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ప్లాంటేషన్ చేసే సంస్థగా ఫారెస్ట్ స్టీవార్డ్ షిప్ కౌన్సిల్ (జర్మనీ) సర్టిఫికేషన్ పొందిన ఎఫ్.డీ.సీ. (దేశంలోనే మొదటి కార్పోరేషన్.) సంప్రదాయ యూకలిప్టస్ స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలు నాటడం, రెవెన్యూ పెంపకంపై దృష్టి. ( టేకు, రోజ్ వుడ్, గంధం, ఎర్ర చందనం, సీతాఫల్, సరుగుడు.) సారించింది. గత ఎనిమిదేళ్లుగా సగటున 82. 69 కోట్ల రూపాయల రాబడి, గత ఆర్థిక సంవత్సరం (2022- 23) 150 కోట్ల రెవెన్యూ వచ్చింది.
* ఈ యేడాది అంచనా 200 కోట్ల రూపాయలుగా పెట్టుకున్నారు.
* ఎఫ్.డీ.సీ నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయి ఎకో పార్కులుగా బొటానికల్ గార్డెన్, పాలపిట్ట సైక్లింగ్ పార్క్, ఫారెస్ట్ ట్రెక్ అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది చేస్తున్నారు.

హరితహారానికి దక్కిన అవార్డులు, గుర్తింపు ఇలా..
* ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(FSI) – స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం ..
* 2015 -21 మధ్య రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85 శాతం పెరిగింది. ఇది 3.36 లక్షల ఎకరాలకు సమానం.
* అదే సమయంలో రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగింది. ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానం.
* ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ -2020 & 21 గా హైదరాబాద్ కు దక్కిన గుర్తింపు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆర్బర్ డే ఫౌండేషన్ ద్వారా అవార్డు లభించింది.
* నీతి అయోగ్ సమీకృత అభివృద్ది లక్ష్యాల సూచీల్లో (2020- 21) అటవీకరణ విభాగంలో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది
* ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టీకల్చర్ ప్రొడ్యూసర్స్ (AIPH), సౌత్ కొరియా ద్వారా వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ – 2022లో హైదరాబాద్
దక్కించుకుంది.
* వరల్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) దేశవ్యాప్తంగా నగరాల్లో నిర్వహించిన సిటీ నేచర్ ఛాలెంచ్ – 2023 లో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాద్. అత్యధిక జీవవైవిధ్యం గల నగరంగాను గుర్తింపు పొందింది
* పచ్చదనం పెంపులో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ (CSE )నివేదిక విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News