Monday, December 23, 2024

పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

2558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం
కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన వారికే వర్తింపు
ఉత్తర్వుల జారీకి మంత్రి ఆదేశం

Green signal for reciprocal transfers

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుల తర్వాత బదిలీల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు అందాయి. ముఖ్యంగా టీచర్ల నుంచి అధిక సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చాయి. వివిధ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. పరస్పర బదిలీలకు  సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయంతో 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుందని మంత్రి తెలిపారు.

317 జిఒ మేరకు జిల్లాల కేటాయింపు

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవో కింద ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ కొంతమందిని కొత్త జిల్లాలకు కేటాయించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జిల్లాల కేటాయింపు జరిగినప్పటి నుంచి పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించడంతో 2,558 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించింది. దీంతో పరస్పర బదిలీలపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని అంగీకార పత్రం ఇచ్చిన వారిని బదిలీ చేసేందుకు విద్యాశాఖ అనుమతించింది. దీంతో 1,260 మంది ఒప్పంద పత్రాలు సమర్పించారు. వీరిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు : పిఆర్‌టియు

రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌కావులు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా 317 జి.ఒ ద్వారా వివిధ జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులకు పరస్పర అంగీకారంతో బదిలీ అవకాశం కల్పిం చి ఉత్తర్వులు విడుదల చేసి దాదాపు 2,558 మంది ఉపాధ్యాయులకు తాము కోరుకున్న జిల్లాలో పనిచేసే విధంగా అవకాశం కల్పించారని పే ర్కొన్నారు. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించడం పట్ల విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్‌కుమార్, విద్యాశాఖ కా ర్యద ర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనలకు పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌కావులు, ఎంఎల్‌సిలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, కూర ర ఘోత్తంరెడ్డి, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్‌లు ధన్యవాదాలు తెలిపారు.
తెరపైకి యశ్వంత్ సిన్హా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News