Friday, January 10, 2025

రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

రైతులకు శుభవార్త
చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం
ఇక చెల్లింపులే తరువాయి

మనతెలంగాణ/ హైదరాబాద్ :  యాసంగిలో పంటల సాగుకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు ఎంతో ఆశ గా ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు శుభవార్త. రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అ నుమతి ప్రతిపాదనను పంపగా, ఎన్నిక ల సంఘం ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సిఇఒ కార్యాలయం అధికా రులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట్లు పంపిణీకి తెలం గాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28, 29, 30 తేదీ ల్లో రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేసింది.

ఇటీవల పథకం కింద నిధుల పంపిణీ నిలిపివేయాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు ఆందోళనకు గురుచేశాయి. రైతుబంధు పథకం ద్వా రా సకాలంలో పెట్టుబడి సాయం అందకపోతే పంటసాగుకాలం వృథాగా పోతుందని, విత్తనాలు వేసుకోలేక జాప్యం చేస్తే ఆ ప్ర భావం పంట దిగుబడులపై దోళనలు వ్యక్తమయ్యాయి. ఒకటి కాదు.. రెం డు కాదు ఏకంగా రూ.5వేల ప్రభుత్వం నుంచి రైతుబంధు పథకం కింద రైతుల బ్యాం కు ఖాతాలకు జమ కావాల్సి ఎన్నికల సంఘం ఈ పథకం నిధుల పంపిణీని అడ్డుకోవడం వల్ల ఆ ప్రభావం రాష్ట్రంలోని 70లక్షల రైతు కుటుంబాలమీద పడింది. సకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభం కాకపోతే గ్రా మీణ ప్రాంతాల్లో వ్యవసాయ నమ్ముకుని కూలీనాలి చేసుకుని జీవిస్తున్న లక్షలాది మంది వ్యవసాయ కూలీలు జీవనోపాధిపై దెబ్బపడింది. వేసవి కాలం వ్యవసాయ పనులకు ప్రత్యామ్నాయంగా మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను కూడా ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఇటు వ్యవసాయ పనులు లేక, అటు ఉపాధి హామీ పనులు దొర క్క గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రభావం లక్షలాది నిరుపేద కుటుంబాలపై పడింది.

ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలేవి ప్రారంభించరాదు. అంతేకాకుండా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టరాదు. రైతుబంధు పథకం అ మలుకు ఎన్నికలకు ఎటువంటి సంబంధం లే దు. వ్యవసాయ రంగంలో రైతులు ఖరీఫ్ రబీ సీజన్లలో రైతుబంధు నిధులు పంటల సాగుకు పెట్టుబడిగా పొందేవిధంగా ప్రభుత్వం రైతుకు హక్కుగా కల్పించింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2018-19లో ప్రారంభించి అప్పటినుంచి ప్రతియేటా అమలు చేస్తూ అర్హతగల ప్రతిరైతుకూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరానికి రూ.10,000 చొప్పున ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో రూ.5000, రబీ సీజన్‌లో రూ.5000 చొప్పున రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ అవుతున్నాయి.

ఇప్పటివరకూ ఈ పథకం కింద సుమారు 70వేలకోట్లు ప్రభుత్వం రైతులకు అందజేసింది. తీరా ఇప్పుడు ఎన్నికల నిబంధనల కారణంగా రైతుబంధు నిధుల విడుదల ఆగిపోతే ఆ ప్రభావం రాష్ట్ర వ్య వసాయరంగంపై అదనులో విత్తనం వేసుకోకపోతే ఆ ప్రభా వం పంటలపైన పెనుప్రభావం చూపనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెల ప్రారంభంలో జీతాలు రాకపోతే ఉద్యోగుల పరిస్థితి ఏవిధంగా ఉంటుం దో ఎన్నికల కమిషన్‌కు తెలియనిదేమీ కాదు. ఆదే విధంగా రైతుబంధు నిధులు విడుదల కాకపోతే పంటల పెట్టుబడికి చేతిలో డబ్బులేక రైతులు కూడా సమస్యల పాలుకావాల్సివస్తుందని రైతులు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఎన్నికలు పూర్తియ్యేదాక రైతుబంధు నిధులు ఆపేస్తే పె ట్టుబడికోసం మళ్లీ ప్రవైటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News