- Advertisement -
జ్ఞానవాపి మసీదులోని సెల్లార్ లో పూజలు జరుపుకునేందుకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గతంలో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఉత్తరప్రదేశ్ లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో దేవతామూర్తుల ఆరాధనకు అనుమతి ఇవ్వాలంటూ కొందరు మహిళలు గతంలో కేసు వేశారు. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు శాస్త్రీయ సర్వే చేపట్టిన భారత పురావస్తు విభాగం మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయంటూ నివేదిక ఇచ్చింది. దీంతో మసీదు సెల్లార్ లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన కేసును సోమవారంనాడు అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
- Advertisement -