Sunday, December 22, 2024

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ హరితోత్సవం వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టలో డంపింగ్ యార్డును తొలగించి నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ దశాబ్ది నర్సరీని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జోనల్ కమిషనర్ మమతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దశాబ్ది నర్సరీలో 9వ విడత హరితహారం కోసం 10 లక్షల మొక్కలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వివిధ రకాల మొక్కలను ఎమ్మెల్యే అధికారులతో పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం.. నేడు పచ్చగా ఉందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వల్లే సాధ్యమైందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. నాటిన మొక్కలను అంతే శ్రద్ధతో కాపాడాల్సిన బాధ్యత మనదేనన్నారు. జగద్గిరిగుట్టలో దుర్వాసన వెదజల్లే డింపింగ్ యార్డును తొలగించి పచ్చని వాతరణంతో సువాసనలు వెదజల్లే నర్సరీని ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో డిసీ ప్రశాంతి, హార్టికల్చర్ డిడి పద్మనాభ, సర్కిల్ మేనేజర్ విజయ రాణి, శానిటేశన్ డిఈఈ ప్రశాంతి, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News