కరీంనగర్: రేపటి తరాలకు మొక్కల ఆవశ్యకత గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ప్రాంగణంలో ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తమ పిల్లలతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి తరాలకు మొక్కల ఆవశ్యకతను తెలపడం చాలా ఆనందంగా ఉందన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించుకునే బాధ్యత కూడా మనమే చేపట్టాలన్నారు. అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆరు విడతలో ప్లాస్టిక్ బ్యాగులను, ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను వాడకూడదని, క్లాత్ బ్యాగ్స్ వాడడం వల్ల మన భూమిని, నీటిని కాపాడుకున్న వాళ్ళమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు గారెపల్లి సతీష్, పుటకం రవీంద్రనాథ్ ఠాగూర్, కలెక్టర్ సీసీలు నర్సింహారావు, రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.