Wednesday, December 25, 2024

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలి

- Advertisement -
- Advertisement -

కొడిమ్యాల: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర కోరారు. బుధవారం కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేట గ్రామంలో పల్లె ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్, వైకుంఠదామం, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీని అదనపు కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్లె ప్రకృతి వనాల్లో పిచ్చి మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలు లేని ప్రాంతాల్లో కొత్తగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వైకుంఠదామాల్లో విద్యుత్, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కల్పించాలని, పూల మొక్కలు నాటి బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ప్రతి గ్రామంలో మురికి కాల్వలు, రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల్లో నీరు నిల్వకుండా చూడాలని, ఈగలు, దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి ట్రాక్టర్ ద్వారా సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి వర్మీ కంపోస్టు తయారు చేయాలన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వారి పనితీరు ఆధారంగా క్రమబద్దీకరించేందుకు సిఫారసు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, డివిజన్ పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News